
యంగ్ హీరో శర్వానంద్ కు ఇటీవల అంతగా కలసి రాలేదు. రణరంగం, జాను, మహా సముద్రం లాంటి పరాజయాలు ఎదురయ్యాయి. శ్రీకారం చిత్రం సో సో గా ఆడింది. దీనితో శర్వానంద్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ' Oke Oka Jeevitham ' అనే చిత్రంలో నటిస్తున్నాడు.
తాజాగా ఒకే ఒక జీవితం టీజర్ విడుదలయింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ తోనే ఉత్కంఠ పెంచేసింది. టీజర్ లో శర్వానంద్ తో పాటు అతడి స్నేహితులుగా ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కనిపిస్తున్నారు. వీరు ముగ్గురూ నాజర్ తయారు చేసిన టైం మెషిన్ లో పాస్ట్ లోకి వెళతారు.
నేను చెప్పబోయే విషయానికి మీరంతా ఆశ్చర్యపోతారు, నమ్మకపోవచ్చు కూడా.. కానీ నమ్మి తీరాల్సిందే' అంటూ నాజర్ చెబుతున్న డైలాగులు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసే విధంగా టీజర్ ఉందని చెప్పడంలో సందేహం లేదు.
ఈ చిత్రానికి జేక్స్ బేజాయ్ సంగీతం అందిస్తున్నారు. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని అమల ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. శర్వానంద్ కి జోడిగా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ లో వెన్నెల కిషోర్ హావభావాలు ఫన్నీగా ఆకట్టుకుంటున్నాయి. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇద్దరూ ఉండడంతో ఈ చిత్రంలో హాస్యం కూడా మెండుగా ఉండబోతోంది.
Also Read: బాలయ్య లాగా డాన్స్ చేసిన నివేదా, బెడిసికొట్టింది.. సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు