Arjun Kapoor: బిగ్ షాక్.. అర్జున్ కపూర్ కి మళ్ళీ కరోనా, ఫ్యామిలీలో నలుగురికి పాజిటివ్.. ఇల్లు సీజ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 29, 2021, 06:13 PM IST
Arjun Kapoor:  బిగ్ షాక్.. అర్జున్ కపూర్ కి మళ్ళీ కరోనా, ఫ్యామిలీలో నలుగురికి పాజిటివ్.. ఇల్లు సీజ్

సారాంశం

పరిస్థితి చూస్తుంటే కోవిడ్ 19 మరోసారి కోరలు చాస్తున్నట్లు అర్థం అవుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. థర్డ్ వేవ్ పై ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలని అప్రమత్తం చేసింది.

పరిస్థితి చూస్తుంటే కోవిడ్ 19 మరోసారి కోరలు చాస్తున్నట్లు అర్థం అవుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. థర్డ్ వేవ్ పై ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలని అప్రమత్తం చేసింది. తాజాగా పరిస్థితులు చూస్తుంటే సెలెబ్రిటీలల్లో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

బాలీవుడ్ ని షాక్ లోకి నెడుతూ స్టార్ హీరో అర్జున్ కపూర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. అర్జున్ కపూర్ తో సహా ఆయన ఫ్యామిలిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అర్జున్ కపూర్ రెండవసారి కోవిడ్ బారీన పడ్డారు. 2020 సెప్టెంబర్ లో అర్జున్ కపూర్ కి తొలిసారి కరోనా సోకింది. అప్పుడు అర్జున్ కపూర్ చికిత్స తీసుకుని కోలుకున్నారు. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం అర్జున్ కపూర్ తో పాటు.. ఆయన సోదరి అన్షులా, బాబాయ్ అనిల్ కపూర్ కుమార్తె రియా కపూర్, ఆమె భర్త కరణ్ లకు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీనితో వారంతా ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 

దీనితో ముంబై మున్సిపల్ అధికారులు అర్జున్ కపూర్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ ని శానిటైజ్ చేసి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. అర్జున్ కపూర్ ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్న వారికీ కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అందుతున్న సమాచారం మేరకు కరుణ్ కపూర్ ప్రేయసి మలైకా అరోరా కూడా కోవిడ్ టెస్టులు చేయించుకోనుంది. 

కరోనా మహమ్మారి ప్రకృతిలో భాగమైపోయింది. కానీ మా ఫ్యామిలీకి కోవిడ్ సోకిన మాట వాస్తవమే. కానీ వార్తల్లో ఎందకు అంతా రాద్ధాంతం చేస్తున్నారు అని రియా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మేమంతా ప్రస్తుతం చాలా కేర్ ఫుల్ గా ఉన్నట్లు పేర్కొంది. 

Also Read: బాలయ్య లాగా డాన్స్ చేసిన నివేదా, బెడిసికొట్టింది.. సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు