వెంటనే ఢీకొట్టాల్సిన అవసరం లేదు: గరికపాటిపై చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 14, 2022, 7:06 PM IST
Highlights

తనపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నీ తప్పు లేకుండా ఆరోపణ చేస్తే వెంటనే ఢీకొట్టాల్సిన అవసరం లేదన్నారు. నిజం నిలకడపై తెలుస్తుందని.. తాను పూర్తిగా నమ్ముతానని చిరు పేర్కొన్నారు
 

విజయదశమి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గరికపాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సంయమనం పాటించడం ముఖ్యమని.. అడుగు వెనక్కి వేయడం కాదన్నారు. 

సంయమనం పాటిస్తేనే నిజానిజాలు నిలకడమీద బయటకు వస్తాయని చిరు తెలిపారు. తప్పు చేయం.. తప్పు చేస్తే పొరపాటు అయ్యిందని ఒప్పుకుంటామని మెగాస్టార్ స్పష్టం చేశారు. నీ తప్పు లేకుండా ఆరోపణ చేస్తే వెంటనే ఢీకొట్టాల్సిన అవసరం లేదన్నారు. నిజం నిలకడపై తెలుస్తుందని.. తాను పూర్తిగా నమ్ముతానని చిరు పేర్కొన్నారు. తాను తప్పు చేయనని తన నమ్మకమని.. తన తప్పు వుంటే అందరికంటే ముందు తానే వస్తానని చిరంజీవి అన్నారు. 

ALso Read:పెద్దాయన.. ఆయన మాటలపై చర్చ అనవసరం : ‘‘గరికపాటి’’ వివాదంపై తేల్చేసిన చిరంజీవి

భూకబ్జా చేశాను అన్నప్పుడు స్పందించలేదని.. తర్వాత తప్పు తెలుసుకుని వారే తనకు సరెండర్ అయ్యారని చిరంజీవి గుర్తుచేశారు. కోర్టు ద్వారానో, అంతరాత్మ ద్వారానో నిజం తెలుసుకున్నారని మెగాస్టార్ తెలిపారు. తాను రాజకీయాల్లోకి వస్తానంటే.. తాను విమర్శించిన వాళ్ల కారుపై రాళ్లు విసిరారని ఆయన గుర్తుచేశారు. తన ఫ్యాన్స్ తప్పు చేసినా.. తాను వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడానని చిరంజీవి తెలిపారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెంచానన్నది ముఖ్యం కాదని.. తన హృదయానికి ఎంత మందిని దగ్గరగా తీసుకున్నానా అన్నదే ముఖ్యమని చిరు పేర్కొన్నారు. ఎద్దేవా చేసినవారు దగ్గరకు వస్తే తాను ఆలింగనం చేసుకున్నానని మెగాస్టార్ తెలిపారు. ఇదే తనకు తెలిసిన ఫిలాసఫీ అన్న ఆయన... ఎక్కువ మంది మనస్సులను తెలుసుకున్నానని చెప్పారు. 

కాగా... వివాద విషయంలోకి వెళితే... దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, పలువురు ప్రముఖలు హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అలయ్‌ బలయ్‌కు వచ్చిన చిరంజీవితో అభిమానులు ఫోటోలు దిగారు. 

మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు  చిరంజీవితో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. 

ALso REad:గరికపాటి నుంచి క్షమాపణలు కోరలేదు.. ఆ మాటలపైనే బాధ, మెగా ఫ్యాన్స్ తొందరపడొద్దు : నాగబాబు

'అక్కడ మొత్తం ఫోటో సెషన్‌ ఆగిపోవాలి. నాకేం మోహమాటం లేదు. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి. ఫోటో సెషన్‌ ఆపేసి ఇక్కడకు రావాలి. లేదంటే నాకు సెలవిప్పించండి' అంటూ వెళ్లిపోతా' అంటూ గట్టిగానే చెప్పారు. వెంటనే అక్కడున్న వారు ఆయనకు సర్ధిచెప్పారు. అంతేగాక సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణ చెప్పారు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఇష్టమని, ఆసక్తిగా వింటానని చెప్పారు. ఒకరోజు తమ ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని చిరంజీవి ఆహ్వానించారు.

మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి నరసింహా రావుపై మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారని జనాలు భావిస్తున్నారు. ''ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే'' అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ప్రముఖ ప్రవచనకర్తను ఉద్దేశించి చేసినదేనని భావిస్తున్నారు. చిరంజీవిపై సీరియస్ అయిన గరికపాటిని ఉద్దేశించి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జోరుగా సాగుతోంది.


 

click me!