
సినీ నటుడు ప్రియాంత్ రావు (Priyanth Rao)ను జూబ్లీహిల్స్ పోలీసులు రెండు రోజుల కింద అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారీ యంగ్ హీరో. ‘కొత్తగా మా ప్రయాణం’ మూవీతో సినిమా హీరోగా అలరించాడు. ఈ క్రమంలో ప్రియాంత్ రావుకు జూనియర్ ఆర్టిస్ట్ తో పరిచయం ఏర్పడింది. అదే అదునుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. అప్పటి పెళ్లి అయిన ప్రియాంత్ రావు.. తన అవసరం తీరాక పెళ్లి మాట ఎత్తుతుండటంతో దాటవేస్తూ వచ్చాడు. అంతేకాకుండా చంపేస్తానని కూడా బెదిరించడంతో ఆ యువతీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించింది.
తనకు న్యాయం చేయాలంటూ ప్రియాంత్ రావుపై పోలీసులకు పైవిషయాలతో ఫిర్యాదు చేసింది. దీంతో జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియాంత్ రావుపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్, రేప్ కేసుల కింద కేసులు నమోదు చేశారు. నిన్న నిందితుడి రిమాండ్ కు కూడా తరలించారు. ఇక విషయం తెలుసుకున్న ప్రియాంత్ రావు భార్య తాజాగా పోలీసులను వింత కోరిక కోరింది. ఏకంగా పోలీస్ స్టేషన్ కు క్యారవాన్ తో వెళ్లి తను భర్త కొన్ని వెసులుబాట్లు కల్పించాలని కోరింది.
ఇంతకీ ఆమె పోలీసులను కోరుకుందేంటంటే.. పోలీసుల అదుపులో ప్రియాంత్ రావు ఉండటంతో.. పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తన భర్తను రాత్రి సమయంలో క్యారవాన్ లో పడుకోవటానికి అనుమతించాలని కోరింది. ఆయనకు గాలి ఆడకపోయినా.. దోమలు కుట్టిన ఆరోగ్యం దెబ్బతింటుందని పోలీసులను వేడుకుంది. అలా చేయడం కుదరని, చట్టరీత్యా వీలుపడదని పోలీసులు చెప్పినా వినిపించుకోలేదు. కాసేపు పోలీసులతో పోరాడిన ఆమె విఫలమైంది. భర్తపై భార్య తన ప్రేమను ఇలా చూపించడంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.