చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. చికిత్స చేసింది ఆ దర్శకుడి అల్లుడే

By telugu teamFirst Published Oct 17, 2021, 8:51 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నేడు తన తెలంగాణ అభిమానులతో సమావేశమైన సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి తన అభిమానుల ద్వారా సరఫరా చేశారు.

మెగాస్టార్ చిరంజీవి నేడు తన తెలంగాణ అభిమానులతో సమావేశమైన సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి తన అభిమానుల ద్వారా సరఫరా చేశారు. చిరంజీవి చేపట్టిన ఈ కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఆక్సిజన్ సకాలంలో అందక కోవిడ్ పేషంట్లు చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

Megastar Chiranjeevi చేపట్టిన Oxygen Banks కార్యక్రమం విజయవంతం కావడంతో అభిమానుల కృషి కూడా ఉంది. దీనితో వారందరిని అభినందించేందుకు చిరు హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అభిమానులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ ఉండడం అందరూ గమనించారు. ఇది అభిమానులని కలవరపెట్టింది కూడా. 

ఏదైనా పెద్ద గాయం అయి ఉంటుందని అనుకున్నారు. దీని గురించి అభిమానులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పుకొచ్చారు మెగాస్టార్. తన కుడిచేతికి సర్జరీ జరిగినట్లు చిరు తెలిపారు.అయితే భయపడాల్సింది ఏమీ లేదు అని అన్నారు. కొన్ని రోజులుగా కుడి చేత్తో ఏ పని చేయాలన్నా తిమ్మిరిగా, నొప్పిగా ఉంటోంది. దీనితో వైద్యులని సంప్రదించా. వారు పరిశీలించి కుడి చేయి మణికట్టు ప్రాంతంలో మీడియాన్ నర్వ్ ఉంటుంది. దానిపై ఎక్కువగా ఒత్తిడి పడ్డప్పుడు నొప్పి ఉంటుంది అని చెప్పారు. చిన్నపాటి సర్జరీ అవసరం అని తెలిపారు. 

దీనితో అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 45 నిమిషాలపాటు సర్జరీ జరిగిందని చిరు తెలిపారు. నర్వ్ చుట్టూ ఉన్న టిష్యులని సరి చేయడంతో ఒత్తిడి తగ్గించారని చిరు పేర్కొన్నారు. 15 రోజుల పాటు విశ్రాంతి అవసరం అని బ్యాండేజ్ వేశారు. ఆ తర్వాత అంతా నార్మల్ గా ఉంటుందని తెలిపారు. సర్జరీ కారణంగా ప్రస్తుతం నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రానికి కూడా గ్యాప్ ఇచ్చా. నవంబర్ నుంచి తిరిగి షూటింగ్ లో పాల్గొంటా అని చిరు పేర్కొన్నారు. 

తనకు సర్జరీ చేసిన డాకర్ట్ సుధాకర్ రెడ్డి ఎవరో కాదు.. నాకు ఎంతో కావలసిన దర్శకుడు విజయబాపినీడు గారి అల్లుడే అని చిరు పేర్కొన్నారు. అలా డాక్టర్ సుధాకర్ రెడ్డితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. దీనితో ఆయన ఎంతో శ్రద్దగా చికిత్స చేశారు. మీరుబాగా కష్టపడుతుంటారు కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయి.. ఇక ఏం పర్వాలేదు అని డాక్టర్ చెప్పినట్లు చిరంజీవి అన్నారు. 

Also Read: ఫ్యాన్స్ తో సమావేశంలో చిరంజీవి ఆవేదన.. ఆక్సిజన్ బ్యాంక్స్ కి కారణం ఆ ఊరిలో జరిగిన సంఘటనే

Vijaya Bapineedu అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి Gang Leader మూవీ. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో గ్యాంగ్ లీడర్ ఒకటి. ఖైదీ చిత్రం చిరంజీవిని టాలీవుడ్ లో సుస్థిరమైన నటుడ్ని చేస్తే.. గ్యాంగ్ లీడర్ మూవీ మెగాస్టార్ మాస్ హిస్టీరియాని ఆకాశం తాకేలా చేసింది. ఆ చిత్రంలో సాంగ్స్, చిరు డాన్సులు, యాటిట్యూడ్ మాస్ ని ఉర్రూతలూగించాయి. 

Also Read: ఘాటుగా లిప్ లాక్ సీన్.. దారుణంగా ట్రోలింగ్, తన భర్తపై హీరోయిన్ కామెంట్స్

click me!