మా వివాదాలపై వర్మ సెటైర్స్... నటులను ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్!

By team teluguFirst Published Oct 17, 2021, 7:18 PM IST
Highlights

దాదాపు రెండు నెలల క్రితం ప్రకాష్ రాజ్ తాను మా అధ్యక్ష బరిలో దిగుతున్నా .. అంటూ ప్రెస్ మీట్ పెట్టడంతో వివాదం మొదలైంది. మొదటి మీటింగ్ లోనే 27 మంది ప్యానెల్ సభ్యులను ప్రకటించిన Prakash raj, తన మద్దతుదారులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. 

వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే వర్మ... థ్రిల్లర్ సినిమాలను తలపిస్తున్న మా వివాదాలపై ఇంత వరకు మాట్లాడకపోవడం ఆశ్చర్యమే. అయితే కొంచెం లేటైనా ఘాటుగా స్పందించాడు వర్మ. సినిమా వాళ్ళను సర్కస్ వాళ్లతో పోల్చాడు. MAA elections నేపథ్యంలో ఇరువర్గాలు చేసుకున్న ఆరోపణలు, విమర్శలను ఉద్దేశిస్తూ.. ఓ ట్వీట్ చేశారు. 

Also read అలయ్ బలయ్ వేదికపై ఎడమొహం పెడమొహంగా మంచు విష్ణు పవన్... వైరల్ గా మంచు విష్ణు ట్వీట్!
దాదాపు రెండు నెలల క్రితం ప్రకాష్ రాజ్ తాను మా అధ్యక్ష బరిలో దిగుతున్నా .. అంటూ ప్రెస్ మీట్ పెట్టడంతో వివాదం మొదలైంది. మొదటి మీటింగ్ లోనే 27 మంది ప్యానెల్ సభ్యులను ప్రకటించిన Prakash raj, తన మద్దతుదారులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ మీట్ లో నాగబాబుతో పాటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ మద్దతుదారులు పాల్గొన్నారు. అదే సమయంలో Nagababu కొన్నాళ్లుగా మా ప్రతిష్ట మసకబారిందని కామెంట్ చేశారు. ప్రకాష్ రాజ్ ప్రస్తుత అధ్యక్షుడు పని తీరు బాగోలేదని విమర్శించారు. 

Also read 'పెళ్లి సందD' హీరోయిన్ చుట్టూ వివాదం.. ఆమె నా కుమార్తె కాదు, నా ఆస్తులు గుంజడానికే..
నాగబాబు, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నరేష్ మరో ప్రెస్ మీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. రెండేళ్ల కాలంలో ఆయన అధ్యక్షతన ఉన్న కమిటీ పనితీరు, కరోనా క్రైసిస్ ఎదుర్కొన్న కార్యాచరణ గురించి, ఆధారాలతో సహా వివరించారు. ఇలా మొదలైన వివాదం... తీవ్రం రూపం దాల్చింది. వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి నటులు దిగజారారు. ఎన్నికల ఫలితాల తరువాత కూడా ఈ పరంపర కొనసాగింది. 


ఈ సంఘటల సమాహారంగా నటులు తమ పరువు తీసుకున్నారని Ram gopal varma ట్వీట్ చేశారు. ప్రేక్షకుల ముందు నటులు తాము నిజమైన సర్కస్ వాళ్లమని నిరూపించుకున్నారని ట్వీట్ చేశారు. వర్మ సెటైరికల్ గా చెప్పినా... ఇది అక్షర సత్యం. గోప్యంగా ఉండాల్సిన నటుల జీవితాలు మా ఎన్నికల వివాదాల కారణంగా రోడ్డున పడ్డాయి. అనేక మంది సీనియర్ నటులు ఈ పరిస్థితులను ఖండిస్తున్నారు. ఎన్నికలు లేకుండా పెద్దల నిర్ణయంతో ఏకగ్రీవం చేయడం ద్వారా, ఇలాంటి అనారోగ్యకర పరిస్థితులు ఏర్పడకుండా చూడవచ్చని అభిప్రాయపడుతున్నారు. 

Cine”MAA”people proved to the audience, that they are actually a CIRCUS 😳😳😳😳

— Ram Gopal Varma (@RGVzoomin)
click me!