ఫ్యాన్స్ తో సమావేశంలో చిరంజీవి ఆవేదన.. ఆక్సిజన్ బ్యాంక్స్ కి కారణం ఆ ఊరిలో జరిగిన సంఘటనే

By telugu team  |  First Published Oct 17, 2021, 5:43 PM IST

కరోనా కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను, ప్రజలని చిరంజీవి ఆదుకున్నారు.


కరోనా కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను, ప్రజలని చిరంజీవి ఆదుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో చిరంజీవి చేపట్టిన గొప్ప కార్యక్రమం ఆక్సిజన్ బ్యాంక్స్. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో చిరంజీవి తన అభిమానుల సహకారంతో ఆక్సిజన్ బ్యాంక్స్ సరఫరా చేశారు. 

కోవిడ్ పరిస్థితుల్లో ఎంతోమంది సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనితో Chiranjeevi చేపట్టిన Oxygen Banks కార్యక్రమం ఎందరికో ఉపయోగపడింది. నేడు చిరంజీవి తెలంగాణ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ నిర్వహణలో పాల్గొన్న తన అభిమానులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో చిరు అభిమానులని అభినందించారు. వారితో అనేక విషయాలు పంచుకున్నారు. 

Latest Videos

హైద‌రాబాద్ లోని Chiranjeevi Blood bank వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మం జరిగింది. అఖిల భార‌త చిరంజీవి యువత అధ్య‌క్షుడు మహేష్ చింతామణి, ర‌మ‌ణం స్వామినాయుడు ఇతర అభిమానులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. క‌రోనా క‌ష్ట‌కాలంలో నా అభిమానుల్ని కోల్పోయి చాలా ఆవేద‌న చెందాను. క‌రోనా భారిన ప‌డి దుర‌దృష్ట వ‌శాత్తు.. ప్ర‌సాద్ - హిందూపురం.. ఎర్రా నాగ‌బాబు- అంబాజీపేట. ర‌వి - క‌డ‌ప వీరంద‌రినీ కోల్పోయాను. క‌రోనా పొట్ట‌న పెట్టుకుని విషాదాన్ని మిగిల్చింది. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాలి అని అన్నారు.

గొల్ల‌ప‌ల్లి అనే  ఒక ఊరు చాలా ఎక్కువ మంది  చ‌నిపోయారు అని తెలిసి ఏం చేయాలి? అని క‌ల‌త చెందాను. అప్పుడు ఆక్సిజ‌న్ బ్యాంకు పెడ‌దామని ఆలోచన పుట్టింది. Covid ప‌రిస్థితిలో అభిమానులు ముందుకొస్తారా? అనుకుంటే నా పిలుపు విని మీరంతా అండ‌గా నిల‌వ‌డం ఎన‌లేని ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది. అనుకున్న‌దే త‌డ‌వుగా వారంలోనే ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించానంటే ఆ క్రెడిబిలిటీ అభిమానుల‌దేన‌ని చిరంజీవి తన ఫ్యాన్స్ పై ప్రశంసలు కురిపించారు. 

Also Read: 'పెళ్లి సందD' హీరోయిన్ చుట్టూ వివాదం.. ఆమె నా కుమార్తె కాదు, నా ఆస్తులు గుంజడానికే..

అనుకున్న సమయానికి సిలిండ‌ర్లు దొర‌క్క చాలా ఛాలెంజులు ఎదుర‌య్యాయి. దుబాయ్.. గుజ‌రాత్.. వైజాగ్ లాంటి చోట్ల ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాల్లో ఆక్సిజ‌న్ ని త‌యారు చేయించాం. 3000 పైగా సిలిండ‌ర్లు త‌యారు చేయించాం... కానీ ఆక్సిజ‌న్ కొర‌త‌ను ఎదుర్కొన్నాం. చాలా శ్ర‌మించాం.. అని తెలిపారు. మ‌హేష్ లాంటి అభిమాని ఒక సైనికుడిలా సేవాకార్య‌క్ర‌మాల్లో ప‌ని చేశారు.

Also Read: హాట్ బాంబ్ మలైకా స్టన్నింగ్ ఫోటోస్.. చూడగానే కిక్కు పక్కా

ఆక్సిజన్ అందక ఐదు నెలలు, పది నెలల పసికందులు మరణించారని తెలిసి చాలా ఆవేదన చెందా. మనం స్థాపించిన ఆక్సిజన్ బ్యాంక్ అలాంటి చిన్నారుల ప్రాణాలు నిలబెట్టినందుకు సంతృప్తిగా ఉంది అని చిరంజీవి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు అభిమానుల సహకారం కావాలని చిరంజీవి కోరారు. 

click me!