'అద్భుతం' మూవీకి చిరంజీవి ఫిదా.. నావల్ కాన్సెప్ట్ అంటూ ప్రశంసలు, బుడ్డ ఇంద్ర వెరీ హ్యాపీ!

pratap reddy   | Asianet News
Published : Nov 23, 2021, 12:47 PM IST
'అద్భుతం' మూవీకి చిరంజీవి ఫిదా.. నావల్ కాన్సెప్ట్ అంటూ ప్రశంసలు, బుడ్డ ఇంద్ర వెరీ హ్యాపీ!

సారాంశం

తన దృష్టికి వచ్చిన ఈ చిత్రానికి అయినా మెగాస్టార్ చిరంజీవి అండగా నిలుస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఆ చిత్రాలకు ప్రచారం కల్పిస్తున్నారు. తాజాగా చిరంజీవి 'అద్భుతం' చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

తన దృష్టికి వచ్చిన ఈ చిత్రానికి అయినా మెగాస్టార్ చిరంజీవి అండగా నిలుస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఆ చిత్రాలకు ప్రచారం కల్పిస్తున్నారు. తాజాగా చిరంజీవి 'Adbhutam' చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అద్భుతం చిత్రం మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రతిభగల దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. 

ఇటీవల ఈ చిత్రం Hotstar ఓటిటీలో నేరుగా విడుదలయింది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రాన్ని విశేష స్పందన లభిస్తోంది. ప్రశాంత్ వర్మ డిఫెరెంట్ టైం పీరియడ్ నేపథ్యంలో ఈ చిత్ర కథని రచించారు. ఇంతకు ముందు కాలానికి సంబందించిన కథలు చాలా చూశాం. కానీ టైం నేపథ్యంలో సాగే ప్రేమ కథ చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి కథతోనే ప్రశాంత్ వర్మ, దర్శకుడు మల్లిక్ రామ్ మ్యాజిక్ చేశారు. 

ఈ చిత్రంలో Teja Sajja, Shivani Rajasekhar జంటగా నటించారు. ఇద్దరి నటన ఆకట్టుకునే విధంగా ఉంది. రొమాంటిక్ గా నటిస్తూనే.. అవసరమైనప్పుడు ఎమోషనల్ గా కూడా మెప్పించారు. అల్లరి పిల్లగా చక్కగా చేసింది. తేజ సజ్జా సెటిల్డ్ పెర్ఫామెన్స్ అందించాడు. ఈ చిత్రంలో తేజ సజ్జా కాలంలో శివాని కంటే ఐదేళ్లు ముందు ఉంటాడు. ఇలా విభిన్నమైన టైం పీరియడ్ లో ఉండే వీరి మధ్య ప్రేమ ఎలా కుదిరింది అనేది ఈ చిత్ర కథ. 

తాజాగా Chiranjeevi అద్భుతం చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. 'హాట్ స్టార్ లో అద్భుతం చిత్రాన్ని చూశాను. ఇది ఎంగేజింగ్ గా సాగే న్యూ ఏజ్ ఫిలిం. నావెల్ కాన్సెప్ట్ తో ఆకట్టుకునే విధంగా ఉంది. తేజ సజ్జా, శివాని ఇద్దరూ ఇంప్రెసివ్ పెర్ఫామెన్స్ అందించారు. వీరిద్దరికి మంచి భవిష్యత్తు ఉంది. అద్భుతం చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

చిరంజీవి ప్రశంసలతో తేజ సజ్జా గాల్లో తేలిపోతున్నాడు. వెంటనే మెగాస్టార్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. తేజ సజ్జా బాల నటుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర చిత్రంలో తేజ సజ్జా చిన్ననాటి ఇంద్ర పాత్రలో మెరిశాడు. 

Also Read: 'దంగల్' నటితో అమీర్ ఖాన్ ఎఫైర్, త్వరలో మూడో వివాహం ? షాక్ లో బాలీవుడ్, అసలు నిజం ఇదిగో..

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా