Bangarraju Teaser: చిన బంగార్రాజు వచ్చేశాడు.. నాగ చైతన్య స్టైల్ టెర్రిఫిక్ అంతే..

pratap reddy   | Asianet News
Published : Nov 23, 2021, 12:07 PM IST
Bangarraju Teaser: చిన బంగార్రాజు వచ్చేశాడు.. నాగ చైతన్య స్టైల్ టెర్రిఫిక్ అంతే..

సారాంశం

కింగ్ నాగార్జున మరోసారి బంగార్రాజుగా అలరించబోతున్నారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి బంగార్రాజు మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నాగార్జున రొమాంటిక్ వేషాలు బాగా ఆకట్టుకున్నాయి.

కింగ్ నాగార్జున మరోసారి బంగార్రాజుగా అలరించబోతున్నారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి బంగార్రాజు మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నాగార్జున రొమాంటిక్ వేషాలు బాగా ఆకట్టుకున్నాయి. ఆ చిత్రంలో నాగార్జున బంగార్రాజు పాత్ర బాగా క్లిక్ అయింది. అదే తరహాలో అభిమానులకు వినోదం అందించేందుకు డబుల్ డోస్ తో ఈసారి రాబోతున్నారు. 

బంగార్రాజుగా నాగార్జున నటిస్తుంటే.. అతడి కొడుకు చిన బంగార్రాజుగా నాగ చైతన్య నటిస్తుండడం విశేషం. తాజాగా ఈ చిత్రంలో నాగ చైతన్య పాత్రని పరిచయం చేస్తూ టీజర్ వదిలారు. సోగ్గాడే.. లో నాగ్ కర్రని విసురుతూ బైక్ ఎక్కే స్టైల్ అద్భుతంగా ఉంటుంది. ఈ టీజర్ లో కూడా నాగ చైతన్యని అదే తరహాలో ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. నాగ చైతన్య రొమాంటిక్ స్మైల్ తో కలర్ ఫుల్ షర్ట్ ధరించి నడుచుకుంటూ కర్ర విసరడం.. అది బైక్ కి వెళ్లి గుచ్చుకోవడం యమా స్టైల్ గా ఉంది. 

మొత్తంగా నాగ చైతన్య ఈ చిత్రంలో నాగార్జునతో పోటీ పడుతూ నటించబోతున్నాడు. తండ్రి బంగార్రాజు పోలికలు కొడుకుకి కూడా వచ్చాయి అని చెప్పేలా ఈ టీజర్ ఉంది. ఈ చిత్రంలో నాగార్జునకు జోడిగా రమ్య కృష్ణ కొనసాగుతోంది. ఇక నాగ చైతన్యకు హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. ఇటీవల కృతి శెట్టి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. 

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువయ్యాలే తెరకెక్కించారు. నాగ్ ని రొమాంటిక్ గా చూపిస్తూనే, ఎమోషనల్ గా మెప్పించడంలో కూడా సక్సెస్ అయ్యాడు. 

Also Read: రెచ్చిపోయిన నందిని రాయ్.. హాట్ థైస్ అందాలతో మతిపోగోట్టే ఫోజులు

నాగార్జున హోమ్ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నేడు నాగ చైతన్య బర్త్ డే. చైతు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఈ టీజర్ తో అభిమానులని సర్ ప్రైజ్ చేసింది. చైతు ఇప్పటికే లవ్ స్టోరీ సక్సెస్ తో మంచి జోరుమీద ఉన్నాడు. బంగార్రాజు టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట
Gaddar Film Awards: చిరంజీవికి ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు.. కమల్‌కి పైడి జయరాజ్‌ అవార్డ్, జయసుధకి ఏఎన్నార్‌ అవార్డు