Naga chaitanya birthday: అఖిల్ కాకుండా నాగ చైతన్యకు మరో తమ్ముడు ఉన్నాడు తెలుసా!

Published : Nov 23, 2021, 12:37 PM IST
Naga chaitanya birthday: అఖిల్ కాకుండా నాగ చైతన్యకు మరో తమ్ముడు ఉన్నాడు తెలుసా!

సారాంశం

అఖిల్ నాగ చైతన్య తమ్ముడు కాగా, నాగార్జున-అమలకు పుట్టిన సంతానం. అయితే నాగ చైతన్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ విషయం చాలా మంది తెలియదు. 


నాగ చైతన్య (Naga chaitanya) రెండు బడా కుటుంబాలకు చెందిన కామన్ వారసుడు. లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు, లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడుల మనవడు.  నాగేశ్వరరావు కొడుకు నాగార్జునకు రామానాయుడు తన కూతరు లక్ష్మీ ని ఇచ్చి వివాహం చేశారు. నాగార్జున, లక్ష్మీలకు నాగ చైతన్య జన్మించాడు. అయితే మనస్పర్థల కారణంగా నాగార్జున, లక్ష్మీ విడిపోవడం జరిగింది. విడాకుల తర్వాత నాగార్జున హీరోయిన్ అమలను రెండో వివాహం చేసుకున్నారు. 


లక్ష్మీ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త శరత్ విజయరాఘవన్ ని వివాహం చేసుకున్నారు. నాగ చైతన్య ఎక్కువగా రామానాయుడు కుటుంబంతోనే ఉండేవాడు. తన ఇద్దరు మామలు వెంకటేష్, సురేష్ బాబు చాలా ఆప్యాయంగా నాగ చైతన్యను పెంచారు. చెన్నైలో ఉన్నప్పటికీ కొడుకు ఆలనా పాలనా గురించి లక్ష్మీ శ్రద్ధ తీసుకునేవారు. అలాగని నాగార్జున(Nagarjuna)కు చైతన్య దూరంగా ఏమీ లేరు. పెద్ద కొడుకుగా నాగ చైతన్యకు నాగార్జున ప్రాధాన్యత ఇచ్చేవాడు. అఖిల్ ని జోష్ సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు నాగార్జున. 

ఇక అఖిల్ (Aakhil) నాగ చైతన్య తమ్ముడు కాగా, నాగార్జున-అమలకు పుట్టిన సంతానం. అయితే నాగ చైతన్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ విషయం చాలా మంది తెలియదు. నాగ చైతన్య అమ్మగారైన లక్ష్మీ-శరత్ లకు ఒక కొడుకు ఉన్నాడు. లక్ష్మీ కొడుకుగా చైతన్యకు అతడు కూడా తమ్ముడు అవుతాడు. అయితే అఖిల్ తెలిసినంతగా ఆయన గురించి తెలియదు. కారణం అతడు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండడం వలన. ఆ మధ్య చెన్నైలో లక్ష్మీ కొడుకు పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సమంత (Samantha), నాగ చైతన్య హాజరుకావడం విశేషం. 

Also read Bangarraju Teaser: చిన బంగార్రాజు వచ్చేశాడు.. నాగ చైతన్య స్టైల్ టెర్రిఫిక్ అంతే..
కాగా నేడు నాగ చైతన్య తన 35వ బర్త్ డే (Naga chaitanya birthday) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్, చిత్ర ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఇక నాన్న నాగార్జునతో కలిసి బంగార్రాజు చిత్రం చేస్తున్న చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ తో థ్యాంక్యూ మూవీ చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ రిలీజ్ లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. 

Also read Bigg boss telugu5: బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేల్చిన సర్వే... టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీరే, యాంకర్ రవికి నిరాశే!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!