రిలీజ్ కాక ముందే రామ్ చరణ్ రంగస్థలం రచ్చ

Published : Nov 04, 2017, 02:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
రిలీజ్ కాక ముందే రామ్ చరణ్ రంగస్థలం రచ్చ

సారాంశం

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న రంగస్థలం రంగస్థలం మూవీ విడుదలకు మరింత ఆలస్యం సంక్రాంతికి కాకుండా సమ్మర్ కు రిలీజ్ వాయిదా రికార్డు స్థాయిలో పలికిన రంగస్థలం శాటిలైట్ హక్కులు 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా రిలీజ్ సంక్రాంతికి అనుకోగా ఇప్పుడు అది మార్చి దాకా వెళ్లిందని టాక్. అనసూయ కూడా రంగస్థలంలో స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే సినిమా నుండి రిలీజ్ అయిన పిక్స్ మెగా ఫ్యాన్స్ ను బాగా అలరిస్తున్నాయి. మరి సినిమా ఆ అంచనాలకు తగ్గట్టు ఉంటుందా లేదా అన్నది చూడాలి.  

 

ఇక ఈ సినిమా రిలీజ్ కు ఐదు నెలలు ఉండగానే రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా శాటిలైట్ రైట్స్ ఓ ఛానెల్ కొనేసిందట. సినిమా నుండి ఎలాంటి టీజర్, పోస్టర్ రిలీజ్ కాకుండానే శాటిలైట్ అవడం చూస్తుంటే ఈ సినిమా తప్పకుండా సంచలనాలు సృష్టిస్తుందని చెప్పొచ్చు. 18 కోట్లు పెట్టి మరి రంగస్థలం శాటిలైట్ హక్కులు పొందారట.

 

 

నాన్ బాహుబలి రికార్డులలో రంగస్థలం టాప్ సెకండ్ లో ఉంటుందని చెప్పొచ్చు. మొదటి సినిమా పవన్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి దాదాపు 21 కోట్లకు శాటిలైట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చరణ్ రంగస్థలం రికార్డ్ రేటుకి అమ్ముడయ్యింది. సినిమా రేంజ్ ఏంటి అన్నది ఈ శాటిలైట్ రైట్స్ చూస్తేనే తెలుస్తుంది.

PREV
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్