వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బాబు పాత్రలో ఆ బాబే..!

Published : Nov 03, 2017, 11:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బాబు పాత్రలో ఆ బాబే..!

సారాంశం

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబుగా జగపతిబాబు వర్మ సినిమాపై తెగ చర్చ చంద్రబాబు పాత్రలో జగపతిబాబు కరెక్ట్ అంటున్న నందమూరి ఫ్యాన్స్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నానంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రకటించగానే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీపై యమా క్రేజ్ ఏర్పడింది. అయితే షూటింగ్ ప్రారంభానికి ముందే అనేక వివాదాలు ఈ చిత్రాలను చుట్టుముట్టడం, పాత్రల ఎంపిక విషయం చాలా ఆసక్తిని రేపుతోంది.

 

ఎన్టీఆర్ జీవితంలో అనేక కోణాలు ఉండటంతో వర్మ మూవీపై తెలుగు నోళ్లలో రోజూ చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ జీవితంలో సాధించిన విజయాలు, సినీ పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎన్టీఆర్ చేసిన కృషి, తెలుగు జాతి ఆత్మగౌరవం అంటూ పార్టీ పెట్టి ప్రజల్లోకి రావడం, జీవిత చరమాంకంలో ఎదుర్కొన్న వెన్నుపోటు వల్ల వచ్చిన క్షోభ మాటల్లో చెప్పలేనది.

ఎన్టీఆర్‌ పై నాదెండ్ల భాస్కర్‌రావు, నల్లపురెడ్డి శ్రీనివాస్‌రెడ్డి లాంటి ఎందరో రాజకీయ తిరుగుబాటు చేసిన వారున్నారు. కానీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు జరిగిన వైస్రాయ్ ఉదంతం నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ కీలక ఘట్టం.

ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాడనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. పదవి కోల్పోయాక ఎన్టీఆర్ కూడా స్వయంగా ఆయనపై ఆరోపణలు సంధించారు కూడా. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక వివాదాల మధ్య ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తే ఇలాంటి అంశాలన్నింటినీ ప్రజలకు చూపించాల్సి వస్తుంది. ఒకవేళ చూపించకపోతే ఆయన జీవిత చరిత్రపై సినిమాకు పరమార్థం ఉండదు. ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించి వేసే ప్రక్రియలో ఒక వర్గం చంద్రబాబు‌ను విలన్‌గా చూపించగా, మరో వర్గం లక్ష్మీపార్వతిని దుష్ట శక్తిగా చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎన్టీఆర్ జీవిత చరిత్రలో వివాదాస్పద అంశాలు. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు, లక్ష్మీ పార్వతి పాత్రను ఎవరు పోషిస్తారు? అనే అంశం సినీ, ప్రేక్షక వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 

ఈ క్రమంలో చంద్రబాబు పాత్రను సినీ నటుడు జగపతి‌బాబు పోషిస్తున్నారనే వార్త వైరల్‌గా మారింది. కులం, మతం, ప్రాంతం అనే అంశాలకు జగపతిబాబు అతీతుడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే సినీ నటులు పెదవి విప్పడానికి భయపడ్డారు. అలాంటి నేపథ్యంలో జై బోలో తెలంగాణలో జగపతిబాబు నటించి రెండు ప్రాంతాల ప్రజలను మెప్పించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌లో అత్యంత వివాదాస్పద పాత్రను పోషించేందుకు జగపతిబాబు సిద్ధపడితే.. దానికి కూడా న్యాయం చేకూరస్తారనే మాట వినిపిస్తున్నది. అంతేకాకుండా జగపతిబాబు అయితే కరెక్ట్‌ గా సరిపోతాడు అని నందమూరి అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్