Kozhikode Sarada: ఆస్పత్రిలో మలయాళీ సీనియర్ నటి మృతి

pratap reddy   | Asianet News
Published : Nov 10, 2021, 08:52 AM ISTUpdated : Nov 10, 2021, 09:01 AM IST
Kozhikode Sarada: ఆస్పత్రిలో మలయాళీ సీనియర్ నటి మృతి

సారాంశం

చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మలయాళీ సీనియర్ నటి కోళికోడ్ శారద తుదిశ్వాస విడిచారు.

చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మలయాళీ సీనియర్ నటి కోళికోడ్ శారద తుదిశ్వాస విడిచారు. 84 ఏళ్ల వయసులో శారద అనారోగ్య కారణాలతో కాలంగా కోళికోడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. 

మలయాళీ సినీ ప్రముఖులు, ఇతర ఆర్టిస్టులు Kozhikode Sarada మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. కోళికోడ్ శారద సినిమాలతో పాటు టివి సీరియల్స్ లో కూడా నటించింది. ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె దాదాపు 80 చిత్రాల్లో కీలక పాత్రలో నటించింది. 

డ్రామా ఆర్టిస్ట్ గా ఉన్నఆమె 1979లో సినీ కెరీర్ ప్రారంభించారు. 'అంగాకురి' అనే చిత్రంతో ఆమె నటిగా పరిచయం అయ్యారు. ఆమె సొంతూరు కోళికోడ్ కావడంతో అంతా ఆమెకి కోళికోడ్ శారద అనిపిలిచేవారు. తల్లి పాత్రలతో మలయాళంలో ఆమె మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

Also Read: Bigg Boss Telugu 5: శ్రీరామ్ కు సోనూసూద్ మద్దతు, వీడియో వైరల్.. బిగ్ బాస్ విజేత అతడేనా!

ఆమె అంత్యక్రియలు సొంత ఊరు కోళికోడ్ లోనే పూర్తయ్యాయి. కేరళ ప్రభుత్వం నుంచి అసెంబ్లీ స్పీకర్ ఎంబి రాజేష్, పిడబ్ల్యూడీ మినిస్టర్ మహమ్మద్ రియాస్, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెరియన్.. కోళికోడ్ శారద మృతికి సంతాపం తెలియజేశారు. 

శారదకొంతకాలంగా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో సోమవారం ఆసుపత్రిలో చేరింది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, ఆ తర్వాతగుండె పోటు రావడంతో ఆమె మరణించినట్లు చెబుతున్నారు. శారదకు నలుగురు పిల్లలు సంతానం.  

Also Read: Allu Arjun: ఐకాన్‌ స్టార్‌కి సజ్జనార్‌ బిగ్‌ షాక్‌.. ప్రతిష్టని కించపరిచారంటూ నోటీసులు జారీ

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌