అల్లు అర్జున్‌పై క్రష్‌ని బయటపెట్టిన `పుష్పక విమానం` హీరోయిన్‌.. జయసుధ పిలవడం వల్లే ఇండస్ట్రీలోకి

Published : Nov 10, 2021, 12:04 AM IST
అల్లు అర్జున్‌పై క్రష్‌ని బయటపెట్టిన `పుష్పక విమానం` హీరోయిన్‌.. జయసుధ పిలవడం వల్లే ఇండస్ట్రీలోకి

సారాంశం

నల్గొండ జిల్లా, వింజమూరు గ్రామానికి చెందిన నటి శాన్వి మేఘన.. హైదరాబాద్‌లో కాలేజ్‌లో చదువుతున్న సమయంలోనే తనకు అవకాశాలు వచ్చాయని చెప్పింది. జయసుధ పిలవడం వల్లే ఇండస్ట్రీలోకి వచ్చామని పేర్కొంది.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun)పై క్రష్‌ ఉందని, ఆయనతో కలిసి నటించాలనేది తన డ్రీమ్‌ అని చెప్పింది `పుష్పక విమానం`(Pushpaka Vimanam) హీరోయిన్‌ శాన్వి మేఘన(Shanvi Meghana). విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండతో కలిసి ఆమె `పుష్పక విమానం` చిత్రంలో నటిస్తుంది. దామోదర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ తన సొంత బ్యానర్‌ కింగ్‌ ఆఫ్‌ హిల్‌ ఎంటర్‌టైన్మెంట్‌, టాంగా ప్రొడక్షన్‌ పతాకాలపై నిర్మించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణ అమ్మాయి శాన్వి మేఘన స్పందించింది. 

నల్గొండ జిల్లా, వింజమూరు గ్రామానికి చెందిన శాన్వి మేఘన.. హైదరాబాద్‌లో కాలేజ్‌లో చదువుతున్న సమయంలోనే తనకు అవకాశాలు వచ్చాయని చెప్పింది. అయితే జయసుధ కాల్‌ చేసి తామొక ప్రోగ్రామ్‌ చేస్తున్నామని పిలవడంతో ఇండస్ట్రీలోకి వచ్చినట్టు చెప్పింది. ఒక లెజెండ్‌ పిలవడంతో కాదనకుండా వచ్చినట్టు తెలిపింది. అయితే జయసుధ భర్త చనిపోవడంతో ఆ టీవీ షో ఆగిపోయిందని, దీంతో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని చెప్పింది. 

ఆమె చెబుతూ, `ఆడిషన్‌ ఇస్తూ తిరుగుతున్న సమయంలో `బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్` చిత్రంలో నాయికగా అవకాశం వచ్చింది. ఆ సినిమా అయ్యాక మెగాస్టార్ `సైరా నరసింహా రెడ్డి`లో ఓ చిన్న క్యారెక్టర్ ప్లే చేశాను. సైరా షూటింగ్ టైమ్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి నన్ను తమన్నా చెల్లిలా ఉంది ఆడిషన్ వద్దు అన్నారు. ఆ మాట పెద్ద కాంప్లిమెంట్ లా ఫీలయ్యా. `సైరా` తర్వాత తరుణ్ భాస్కర్ గారు నెట్ ఫ్లిక్స్ `పిట్ట కథలు` వెబ్ సిరీస్ కు ఆడిషన్ చేసి తీసుకున్నారు. ఆయనే "పుష్పక విమానం"  చిత్రానికి నన్ను రిఫర్ చేశారు` అని చెప్పింది.

`పుష్పక విమానం` గురించి చెబుతూ, `ఈ చిత్రంలో నేను షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. చాలా బబ్లీ రోల్ ఇది. ఈ క్యారెక్టర్ లో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. ఈ సినిమాలో హీరో ఆనంద్, గీత్ సైని, నా క్యారెక్టర్స్ ఎక్కడా రెగ్యులర్ హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ లా ఉండవు. అవి కథలో సహజంగా ప్లే అవుతూ ఉంటాయి. `పుష్పక విమానం`  ఫస్టాప్ చాలా ఫన్ గా సాగుతుంది. సెకండాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. సినిమాలో ఆనంద్ క్యారెక్టర్ తో నా రిలేషన్ ఏంటనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.  

`ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ నా గురించి బాగా చెప్పారు. నా పర్మార్మెన్స్ బాగుందన్నారు. అక్కడే మా అమ్మా నాన్న కూడా ఉన్నారు. విజయ్ ప్రశంసకు నేనూ, అమ్మా నాన్న హ్యాపీ అయ్యాం. హీరోయిన్ గా ఇలాంటి క్యారెక్టర్ లే చేయాలని నియమం పెట్టుకోలేదు. నాకు నచ్చితే నటిస్తాను. ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి గారు, హీరో అల్లు అర్జున్. విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వీరితో కలిసి నటిస్తాను. అయితే అల్లు అర్జున్‌ అంటే పెద్ద క్రష్‌. ఆయనతో కలిసి నటించాలనేది నా డ్రీమ్‌` అని తెలిపింది శాన్వి. 

also read: Allu Arjun: ఐకాన్‌ స్టార్‌కి సజ్జనార్‌ బిగ్‌ షాక్‌.. ప్రతిష్టని కించపరిచారంటూ నోటీసులు జారీ
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar: ధురంధర్ కోసం డైరెక్టర్ ఆదిత్య ధర్ ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా.. స్టార్లు ఎవరూ ఒప్పుకోలేదు, కానీ
Sharwanand: 23 ఏళ్ల కుర్రాడి టాలెంట్‌కి శర్వానంద్‌ ఫిదా.. టాలీవుడ్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌