Bigg Boss Telugu 5: శ్రీరామ్ కు సోనూసూద్ మద్దతు, వీడియో వైరల్.. బిగ్ బాస్ విజేత అతడేనా!

By telugu teamFirst Published Nov 10, 2021, 8:03 AM IST
Highlights

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 5 రసవత్తరంగా సాగుతోంది. ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతుండడంతో హౌస్ లో బలమైన కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 5 రసవత్తరంగా సాగుతోంది. ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతుండడంతో హౌస్ లో బలమైన కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వీరిలో బిగ్ బాస్ 5 టైటిల్ ఎవరికి దక్కుతుందో అనే ఆసక్తి నెలకొంది. రవి, మానస్, శ్రీరామ్, సన్నీ, అనీ మాస్టర్ లాంటి బలమైన కంటెస్టెంట్స్ మధ్య టైటిల్ పోటీ ఉన్నట్లు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. 

సన్నీ, Sreeram లాంటి కంటెస్టెంట్స్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఖచ్చితంగా టైటిల్ వీళ్ళే గెలుస్తారని ఇప్పుడే చెప్పలేం. కానీ నెటిజన్లు మాత్రం తమకు నచ్చిన కంటెస్టెంట్ కి మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో క్యాంపైన్ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా నేషనల్ హీరో Sonu Soodలాంటి నటుడు ఒక కంటెస్టెంట్ కి మద్దతు ఇస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించలేం. తాజాగా సోనూసూద్ Bigg Boss Telugu 5లో సింగర్ శ్రీరామ్ కు తన మద్దతు తెలిపాడు. అతడి గురించి సోనూసూద్ మాట్లాడుతున్న వీడియో బైట్ వైరల్ గా మారింది. శ్రీరామ్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియో పోస్ట్ అయింది. 

'మీరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో శ్రీరామ్ ని చూస్తున్నారా ? నేను చూస్తున్నాను. శ్రీరామ్ కి నా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నాను.ఇలాగే హౌస్ లో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్ అని సోనూసూద్ ప్రోత్సహించాడు. సడెన్ గా సోనూసూద్ లాంటి క్రేజీ నటుడు శ్రీరామ్ కి మద్దతు తెలపడం ఆసక్తిగా మారింది. అయితే శ్రీరామ్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

Also Read: Bigg Boss Telugu 5: జెస్సీ ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. మానస్‌కి ముద్దులిచ్చిన ప్రియాంక..కాజలే సాక్ష్యం..

ఇక బిగ్ బాస్ 5 టైటిల్ శ్రీరామ్ దే అంటూ సోనూ సూద్ వీడియోపై స్పందిస్తున్నారు. హామీద ఉన్నని రోజులు శ్రీరామ్ ఆమెతో లవ్ ట్రాక్ నడిపాడు. హమీద ఎలిమినేట్ అయ్యాక శ్రీరామ్ సింగిల్ గానే గేమ్ ఆడుతున్నాడు. హౌస్ లో అప్పుడప్పుడూ శ్రీరామ్ తన గాత్రంతో ఇంటి సభ్యులలో జోష్ నింపుతున్నాడు శ్రీరామ్. 

ఇదిలా ఉండగా కరోనా లాక్ డౌన్ తర్వాత సోనూసూద్ నేషనల్ హీరోగా మారిపోయాడు. కరోనా కష్టకాలంలో సోనూసూద్ చేసిన సహాయాలు అన్నీఇన్నీ కావు. లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన వలస కార్మికుల్ని వారి సొంత ప్రాంతాలకు చేర్చడం దగ్గర నుంచి.. ఉపాధి కోల్పోయిన యువతకు ఉపాధి కల్పించడం, ఆర్థిక సహాయం, వైద్యం, నిత్యావసర సరుకులు, ఆక్సిజన్ సిలిండర్లు ఇలాచెప్పుకుంటూ పోతే సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది సోనూసూద్ ని అభినవ కర్ణుడిగా కూడా ప్రశంసించారు.  

 

click me!