భావనపై దాడి కేసు- అసలు సూత్రధారి కావ్య మాధవన్?

Published : Aug 31, 2017, 01:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
భావనపై దాడి కేసు- అసలు సూత్రధారి కావ్య మాధవన్?

సారాంశం

మళయాళ నటి భావన కిడ్నాప్ కేసు అనుహ్య మలుపులు తిరుగుతోంది. నిందితుల్లో భావన మాజీ డ్రైవర్ కూడా ఉన్నాడు. నిందుతులను పోలీసులు విచారించగా.. దీనంతటికీ వెనుక  ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఉన్నాడని తేలింది. వెంటనే పోలీసులు అతనిని అరెస్టు చేశారు స్కెచ్ వేసి  మరీ  కావ్య ప్లాన్ రాసిందట

 

మళయాళ నటి భావన కిడ్నాప్ కేసు అనుహ్య మలుపులు తిరుగుతోంది. ఆమెపై కిడ్నాప్ కుట్రకు పాల్పడింది ప్రముఖ నటుడు దిలీప్ అని నిన్నటి దాటా అందరూ భావించారు. కాగా.. ఈ దాడి చేయించింది ఆయన కాదట.. దిలీప్ ప్రస్తుత భార్య కావ్య మాధవన్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

 అసలేం జరిగిందంటే.. గత కొంత కాలం క్రితం నటి భావన కారులో వెళుతుండగా.. కొందరు దుండగులు ఆమెని కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి యత్నించారు. దాన్నంతటినీ మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి అనంతరం ఆమెను  వదిలేశారు. కాగా.. ఆ వీడియోని చూపించి ఆమెను బ్లాక్ మొయిల్ చేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో భావన మాజీ డ్రైవర్ కూడా ఉన్నాడు. నిందుతులను పోలీసులు విచారించగా.. దీనంతటికీ వెనుక  ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఉన్నాడని తేలింది. వెంటనే పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఇదంతా మనందరికీ తెలిసిందే.

నిన్నటి వరకు దిలీప్ పేరు చెప్పిన నిందితులు.. ఇప్పుడు ఇది చేయించింది కావ్య మేడమ్ అని చెబుతున్నారట. దిలీప్ మొదటి భార్య.., నటి భావన.. ఇద్దరూ మంచి స్నేహితులు. ఈ విషయంలోనే కావ్యకి భావనకి పడలేదని.. అందుకే ఈ దాడి చేయించి ఉటుందని అందరూ భావిస్తున్నారు.  అంతేకాదు.. ఈ దాడి కోసం కావ్య స్కెచ్ వేసి మరీ ప్లాన్ రాసిందట . అయితే.. కావ్య మాత్రం తనకేమీ తెలియదని చెబుతోంది. ఇందులో నిజానిజాలేమిటో తెలియాలంటే.. మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా