ప్రభాస్ తో సినిమా చేసేందుకు మురుగదాస్ ఆసక్తి

Published : Aug 31, 2017, 12:09 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ప్రభాస్ తో సినిమా చేసేందుకు మురుగదాస్ ఆసక్తి

సారాంశం

ప్రస్థుతం సూపర్ స్టార్ మహేష్ తో స్పైడర్ చేస్తున్న మురుగదాస్ ప్రభాస్ తో సినిమా చేయాలని బాలీవుడ్ నిర్మాతల నుంచి మురుగదాస్ కు ఆఫర్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు మురుగదాస్ ఆసక్తి

తమిళ స్టార్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ ప్రస్థుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రం పనుల్లో బిజీగా వున్నారు. ఈ చిత్రం అయిపోయిన వెంటనే... తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నారు. ఇఫ్పటి వరకు తన కెరీర్ సాగుతున్న తీరుపట్ల మురుగదాస్ ఎంతో హ్యాపీగా వున్నాడు. అంతేకాదు.. మురుగదాస్ వద్ద దక్షిణాది స్టార్ హీరోలందరికీ సరిపడే స్క్రిప్టులే కాక ఉత్తరాది స్టార్ హీరోలకు సంబంధించిన స్క్రిప్ట్ లు రెడీగా వున్నాయి.

 

మరోవైపు బాలీవుడ్ కు చెందిన పలు సినీ నిర్మాణ సంస్థలు హీరో ప్రభాస్ తో కలిసి ఓ సినిమా చేయాల్సిందిగా మురుగదాస్ ను కోరుతున్నట్లు సమాచారం. ఈ ప్రపోజల్ పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు మురుగదాస్. అయితే ఇటు మురుగదాస్, అటు ప్రభాస్ లు ఇద్దరూ తమ కమిట్ మెంట్స్ ఫినిష్ చేసే పనిలో బిజీగా వున్నారు. అయితే అన్నీ కుదిరితే త్వరలోనే ప్రబాస్, మురుగదాస్ ల ప్రాజెక్ట్ ఓకే కానుంది.

 

అదే జరిగితే.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పెద్దయెత్తున బిజినెస్ చేయటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే బాహుబలితో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ప్రభాస్.. సాహోతో మరోసారి మరింత క్రేజ్ సంపాదించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీని తర్వాత మురుగదాస్ తో ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం హిందీలో కూడా ప్రభాస్ పెద్ద స్టార్ అయిపోతాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?