మళ్లీ నిర్మాతగా మారుతున్న నాని?

Published : Aug 31, 2017, 01:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
మళ్లీ నిర్మాతగా మారుతున్న నాని?

సారాంశం

ఇటీవలే ‘ నిన్ను కోరి’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే నాని.. గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది . మళ్లీ నిర్మాణ రంగం వైపు అడుగులు వెస్తున్నారని తెలుస్తోంది.

 

వైవిద్య సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు హీరో నాని. ఇటీవలే ‘ నిన్ను కోరి’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవలే తండ్రి గా మారిన నాని.. గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆయన మరోసారి నిర్మాణ రంగంపై దృష్టిపెడుతున్నారని దాని సారాంశం.

 ఇప్పటికే నాని ...  సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ లు హీరోలు ‘ డీ  ఫర్ దోపిడి’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. కానీ.. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద డీలా పడిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. దీంతో కొంత కాలం అటు వైపు వెళ్లలేదు నాని. కానీ.. తాజాగా.. మళ్లీ నిర్మాణ రంగం వైపు అడుగులు వెస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవల ప్రశాంత్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నానికి తెగ నచ్చేసిందట. గతంలో 'డైలాగ్ ఇన్ ద డార్క్' అనే షార్ట్ ఫిలిమ్‌కు దర్శకత్వం వహించాడు ప్రశాంత్.సినిమా దర్శకత్వం విషయంలో అనుభవం లేనప్పటికీ నాని తనే నిర్మాతగా ఈ యువదర్శకుడికి అవకాశం ఇస్తుండటం విశేషం. కథలో నాని చెప్పిన మార్పులు చేసుకుంటూ అవసరమైన నటీనటులతో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఈ కొత్త సినిమా విషయమై నాని నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఇందులో హీరోగా నాని నటిస్తారా లేదా.. ఇంకెవరినైనా హీరోగా తీసుకుంటారో కూడా తెలియాలి.

 ప్రస్తుతం నాని దిల్ రాజు నిర్మాణంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి’, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండింటిలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' డిసెంబర్‌లో విడుదల కానుంది.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా