
ప్రస్తుతం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో గల ఓ భవంతిలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు.హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ముంబై, పూణెలలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఫిబ్రవరిలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్తారట ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్.
తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సంభవామి’ టైటిల్ పరిశీలనలో ఉంది. దీంతో పాటు మరికొన్ని టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారు. చివరకి, ఏ టైటిల్ కన్ఫర్మ్ చేస్తారనేది నెలాఖరుకి తెలుస్తుంది.