
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ వార్త రానే వచ్చింది. ఇప్పటి వరకు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్న నందమూరి హీరో ఎన్టీఆర్ ఇప్పుడు శాతకర్ణి చిత్రం చూశానని ట్వీట్ చేశాడు. సాహో బాలకృష్ణ బాబాయ్, సాహో క్రిష్, సాహో చిత్ర టీమ్ అని ట్వీట్ చేశాడు.
ఇది తెలుగు వాడి విజయమని, తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రమని, చరిత్ర మరచిన తెలుగు చక్రవర్తికి నీరాజనం అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. మొత్తంమీద నందమూరి ఫ్యామిలీలో విబేధాలు సద్దుమణిగేందుకు ఎన్టీఆర్ ప్రయత్నాలు ఆపలేదన్నమాట.