అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కు ఆ ఛార్మ్ త‌గ్గిందా?

Published : Jan 16, 2017, 03:24 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కు ఆ ఛార్మ్ త‌గ్గిందా?

సారాంశం

టాలీవుడ్ లో బ్యూటీ హిరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్  ప్రేమ‌మ్ మూవీలో త‌న అందాల‌ను చూపించిన బ్యూటి తాజాగా న‌టించిన శ‌త‌మానం భ‌వ‌తి లో అంత అందంగా క‌నిపించ‌ని అనుపమ


కానీ.. అందరికి షాకిస్తూ.. ప్రేమమ్ లో ఆమె అందంలోని ఫ్రెష్ నెస్ బయటకొచ్చేసరికి ఇండస్ట్రీనే కాదు.. ప్రేక్షకులు ఒక్కసారిగా ఫీలయ్యారు. అఆ ఇమేజ్ ప్రేమమ్ మూవీతో మొత్తంగా మార్చేసుకొని.. ఆఫర్ల మీద ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ భామ.. చరణ్ తో మూవీని కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి వచ్చినోళ్లలో మోస్ట్ లక్కీయస్ట్ పర్సన్ గా పరమేశ్వరన్ ను పలువురు అభివర్ణిస్తుంటారు.

మరీ.. క్యూట్ బ్యూటీకి ఏమైందో ఏమో కానీ.. తాజాగా ఆమె నటించిన శతమానం భవతి సినిమాలో ఛార్మ్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. ప్రేమమ్ రేంజ్ ని క్రాస్ చేసేలా అమ్మడు ఉంటుందని పీలైనోళ్లను నిజంగానే ఫీల్ చేసినట్లు కనిపిస్తోంది. మరీ.. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అనుపమ పరమేశ్వరన్ మేకప్ ఆమెను డ్యామేజ్ చేసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రేమమ్ లో కనిపించిన ఛార్మ్ శతమానం భవతిలో మిస్ అయినట్లుగా కనిపించింది.

ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే.. సెకండాఫ్ లో అందంగా కనిపించిన అనుపమ.. మేకప్ విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సినిమాకు సినిమాకు వేరియేషన్ ఉంటే ఫర్లేదు. కానీ.. ఒకేసినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఒకలా.. సెకండాఫ్ మరోలా ఉండటం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. మేకప్ విషయంలో మరికాస్త శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది

PREV
click me!

Recommended Stories

'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ లో హీరోయిన్ గా 46 ఏళ్ళ నటి.. దిల్ రాజు ప్లానింగ్ ఇదే
ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?