Namrata shirodkar: సర్కారు వారి పాట సెట్స్ లో నమ్రత సందడి... కీర్తి సురేష్ తో అలా!

Published : Oct 26, 2021, 03:06 PM IST
Namrata shirodkar: సర్కారు వారి పాట సెట్స్ లో నమ్రత సందడి... కీర్తి సురేష్ తో అలా!

సారాంశం

ప్రస్తుతం Sarkaru vaari paata టీమ్ స్పెయిన్ లో ఉంది. రెండు వారాలుగా అక్కడే సర్కారు వారి పాట షూటింగ్ జరుపుతున్నారు. పనిలో పనిగా మహేష్ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. 

మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో సంక్రాంతి బరిలో దిగనున్నారు. దాని కోసం Mahesh babu మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. వరుస షెడ్యూల్స్ తో టీమ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. కాగా సర్కారు వారి పాట సెట్స్ లో హీరోయిన్ నమ్రత కనిపించి సందడి చేశారు. ఆమె హీరోయిన్ కీర్తి సురేష్ తో ముచ్చటిస్తున్న ఫోటో షేర్ చేశారు. 


ప్రస్తుతం Sarkaru vaari paata టీమ్ స్పెయిన్ లో ఉంది. రెండు వారాలుగా అక్కడే సర్కారు వారి పాట షూటింగ్ జరుపుతున్నారు. పనిలో పనిగా మహేష్ ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. స్పెయిన్ దేశంలోని అందమైన ప్రదేశాలలో Namrata shirodkar, సితార, గౌతమ్ విహరిస్తున్నారు. ఇక ఖాళీగా ఉన్న సమయంలో నమ్రత సర్కారు వారి పాట సెట్స్ కి వెళుతున్నారు. బార్సిలోనా లో మహేష్, Keerthy suresh పై ఓ పాట షూట్ చేస్తున్నారు. కాగా సర్కారు వారి పాటలో మహేష్ సొంత నిర్మాణ సంస్థ సైతం భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. 

Also read Bigg boss tamil 5:నా ఓటు ఆ కంటెస్టెంట్ కే మీరు కూడా సప్పోర్ట్ చేయండి.. రానా వైఫ్ మిహికా వీడియో వైరల్
దర్శకుడు పరుశురాం బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, ఆర్ధిక నేరాల నేపథ్యంలో సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక మహేష్ పాత్ర సైతం రఫ్ అండ్ టఫ్ యాటిట్యూడ్ తో డిఫరెంట్ గా డిజైన్ చేశారట. సినిమాపై ప్రేక్షకులలో బారి అంచనాలు ఏర్పడ్డాయి. సర్కారు వారి పాట చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాను మరో స్థాయికి చేర్చాయి. 

Also read బొమ్మరిల్లు భాస్కర్ కి అల్లు అరవింద్ మరో బంపర్ ఆఫర్.. ఈసారి క్రేజీ కాంబో ?
2022 సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలతో భీకర పోరు నడవనుంది. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా సంక్రాంతినే టార్గెట్ చేసింది. అలాగే Prabhas రాధే శ్యామ్, పవన్ భీమ్లా నాయక్ చిత్రాలు సైతం సంక్రాంతికి విడుదల కానున్నాయి. మరి టాలీవుడ్ స్టార్స్ అందరూ పోటీపడుతున్న 2022 సంక్రాంతి విన్నర్ ఎవరు కానున్నారో చూడాలి. 


 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ