నా కుమార్తె పెళ్ళికి డబ్బు మాత్రమే ఇస్తా.. నాకు సంబంధం లేదు, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు

By telugu teamFirst Published Oct 26, 2021, 2:56 PM IST
Highlights

ప్రకాష్ రాజ్ తన నటనతో అన్ని భాషల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తిరుగులేని నటుడిగా రాణిస్తున్నారు. కేవలం సినిమాలతో మాత్రమే కాక పొలిటికల్ కామెంట్స్ చేస్తూ తరచుగా ప్రకాష్ రాజ్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

ప్రకాష్ రాజ్ తన నటనతో అన్ని భాషల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తిరుగులేని నటుడిగా రాణిస్తున్నారు. కేవలం సినిమాలతో మాత్రమే కాక పొలిటికల్ కామెంట్స్ చేస్తూ తరచుగా ప్రకాష్ రాజ్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవల ప్రకాష్ రాజ్ 'మా' ఎన్నికల్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 'మా' అధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ఓటమి చెందారు. అక్టోబర్ 10న జరిగిన ఎన్నికల్లో Manchu Vishnu విజయం సాధించిన సంగతి తెలిసిందే. మా ఎన్నికల వివాదం ఏదో ఒక రూపంలో ఇంకా కొసాగుతూనే ఉంది. 

'MAA ' ఎన్నికల అంశాన్ని కాసేపు పక్కన పెడితే.. ఇటీవల Prakash Raj ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ 2009లో తన మొదటి భార్య నుంచి విడాకులు పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ పోనీ వర్మ అనే కొరియోగ్రాఫర్ ని వివాహం చేసుకున్నాడు. ప్రకాష్ రాజ్ అతడి మాజీ భార్యకు ముగ్గురు పిల్లలు సంతానం. ముగ్గురిలో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

ప్రకాష్ రాజ్ తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ..నా పెద్ద కుమర్తె చదువు పూర్తి చేసింది. ఆమెకు సంగీతంలో ఆసక్తి ఉంది. తన సినీ కెరీర్ కు సాయం చేయమని పూజ అడిగితే తప్పకుండా చేస్తా. ఓ తండ్రిగా ఆమెకు అండగా ఉంటా. కానీ పెళ్లి విషయంలో ఆమెకు తండ్రిగా ఉండలేను. తన పెళ్ళికి డబ్బు అడిగితే ఇస్తాను. పిలిస్తే వెళ్లి అక్షింతలు వేస్తాను. అంతకు మించి నాకు సంబంధం లేదు అంటూ ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా అందుకు తన కుమార్తె కూడా ఒప్పుకుందని ప్రకాష్ రాజ్ తెలిపారు. 

Also Read: భూమిక మైండ్ బ్లోయింగ్ హాట్.. భర్తతో విభేదాల గురించి పరోక్షంగా పోస్ట్, ఫోటోస్ వైరల్

ప్రకాష్ రాజ్ తన కూతురి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక తాను తన మాజీ భార్య లలితకి భర్తగా మాత్రమే విడాకులు ఇచ్చా. నా పిల్లలకు తల్లిగా కాదు. ఇప్పుడు తాము స్నేహితులుగా ఉన్నాం. ఎలాంటి సమస్యలు లేవు అని ప్రకాష్ రాజ్ తెలిపారు. ప్రకాష్ రాజ్ తన కుమార్తె గురించి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. అతడు తన కూతురు ఇండివిడ్యువల్ గా ఉండాలని కోరుకుంటున్నాడేమో. అంటే తన కుమార్తె.. తనకు కాబోయే పార్ట్నర్ తానే ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడేమో.

 

click me!