సమంతకు అఫైర్స్ ఉన్నాయని, ఆమె అబార్షన్ చేయించుకున్నారని, నాగ్ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కథనాలు వండివార్చారు. వీటన్నిటికీ సమంత సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు.
సమంత చైతన్యతో విడాకుల ప్రకటన చేసి మూడు వారాలు అవుతుంది. అందుకు ముందు నుండే ఈ వార్త మీడియాలో ప్రముఖంగా వినిపించింది. ఇక విడాకుల ప్రకటన తరువాత సమంత-చైతు మధ్య విబేధాలకు కారణాలు విశ్లేషిస్తూ అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరింత ఉత్సాహం ప్రదర్శించాయి. Samantha ను కార్నర్ చేస్తూ నిరాధార కథనాలు ప్రసారం చేయడం జరిగింది.
సమంతకు అఫైర్స్ ఉన్నాయని, ఆమె అబార్షన్ చేయించుకున్నారని, నాగ్ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కథనాలు వండివార్చారు. వీటన్నిటికీ సమంత సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని, విడాకుల వలన మానసికంగా వేదన అనుభవిస్తున్నాని తెలిపారు. అదే సమయంలో ఇలాంటి తప్పుడు కథనాలు రాయడం మానేయాలని వేడుకున్నారు.
Also read స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో స్టైలిష్ ఫోజులిస్తున్న మెగా డాటర్ నిహారిక... అమ్మడు ఆనందం వెనుక కారణం అదేనా!
అయినప్పటికీ సమంతపై దుష్ప్రచారం ఆగలేదు. దీనితో విసిగిపోయిన సమంత చట్టపరమైన చర్యల ద్వారానే సదరు మీడియా సంస్థలకు గట్టి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు. తన లాయర్ల ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై పరువునష్టం దావా కేసు వేయించారు. ఈ వ్యవహారంలో సదరు మీడియా సంస్థలు వేడుకున్నా, సమంత వెనక్కి తగ్గలేదు. తన కేసు వాపస్ తీసుకోలేదు. ఇక సమంత పరువు నష్టం దావా పిటీషన్ పై కోర్ట్ తీర్పు వెలువరించాల్సి ఉంది.
Also read హృదయ విదారక ఘటన.. మనసులు గెలుచుకున్న శేఖర్ కమ్ముల, ఏం జరిగిందంటే..
మరోవైపు సమంత చార్ ధామ్ యాత్ర పూర్తి చేసుకొని వచ్చారు. తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి హిమాలయాల్లో ఉన్న కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి ఆలయాలను సందర్శించారు. సమంత char dham యాత్రకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.