విక్కీ-కత్రినా పెళ్లి.. వంద కోట్ల డీల్‌.. షాకిస్తున్న వెడ్డింగ్‌ ఈవెంట్‌ కాస్ట్

Published : Dec 07, 2021, 12:03 PM IST
విక్కీ-కత్రినా పెళ్లి.. వంద కోట్ల డీల్‌.. షాకిస్తున్న వెడ్డింగ్‌ ఈవెంట్‌ కాస్ట్

సారాంశం

కొద్ది మంది బంధుమిత్రులు, సినీ సెలబ్రిటీల సమక్షంలో విక్కీ-కత్రినా మ్యారేజ్‌ ప్లాన్‌ చేశారు. అత్యంత లావిష్‌గా వీరి వివాహం జరగబోతుందని తెలుస్తుంది. నెవర్‌ బిఫోర్‌ అనేలా మ్యారేజ్‌ని ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌(Katrina Kaif), యంగ్‌ హీరో విక్కీ కౌశల్‌ (Vicky kaushal) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే తమ ప్రేమ పాఠాలకు ముగింపు పలకబోతున్నారు. వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయ్యింది. మ్యారేజ్‌ వేడుక కూడా మంగళవారం నుంచి ప్రారంభమైంది. రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో వీరి మ్యారేజ్‌ జరగనుంది. నేటి నుంచి 10వ తేదీ వరకు రాజస్థాన్‌లో విక్కీ, కత్రినాల వివాహ వేడుకలు జరగనున్నాయని బాలీవుడ్‌ టాక్‌.

కొద్ది మంది బంధుమిత్రులు, సినీ సెలబ్రిటీల సమక్షంలో Vicky Katrina Marriage ప్లాన్‌ చేశారు. అత్యంత లావిష్‌గా వీరి వివాహం జరగబోతుందని తెలుస్తుంది. నెవర్‌ బిఫోర్‌ అనేలా మ్యారేజ్‌ని ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరి మ్యారేజ్‌కి సంబంధించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. సల్మాన్‌ ఖాన్‌, రణ్‌బీర్ కపూర్‌లతో ప్రేమలో మునిగి తేలి, వారితో బ్రేకప్‌ చేసుకుని మరీ విక్కీ కౌశల్‌ని మ్యారేజ్‌ చేసుకుంటోంది కత్రినా. ఓ రకంగా వారిద్దరు క్యాట్‌కే మోసం చేశారని టాక్‌ వినిపిస్తుంది. 

ఈ నేపథ్యంలో  తాజాగా విక్కీ-కత్రినాల మ్యారేజ్‌ వేడుక ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాదు అత్యంత కాస్ట్లీ మ్యారేజ్‌గా మారింది. వీరిద్దరు మ్యారేజ్‌కి సంబంధించి ఏకంగా వంద కోట్ల డీల్‌ జరిగిందని సమాచారం. ప్రస్తుతం విక్కీ-కత్రినా పెళ్ళి వేడుక అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్న నేపథ్యంలో వీరి వివాహం ఎలా జరగబోతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దాన్ని క్యాష్‌ చేసుకోబోతున్నాయి మీడియా మాధ్యమాలు. అందుకోసం ఏకంగా వండ కోట్ల డీల్‌ కుదుర్చుకున్నట్టు టాక్‌. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి స్ట్రీమింగ్ కోసం ఒక బడా మీడియా ఓటీటీ సంస్థ 100కోట్ల ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ స్టార్ సెలబ్రెటీకి దక్కని రేంజ్ లో వీరికి బంపరాఫర్ ఇవ్వడం విశేషం. నిజానికి కొంతమంది స్టార్స్ గతంలో ఇదే తరహాలో పెళ్లి వేడుకలను బిజినెస్ గా చేసుకున్నారు. గతంలో సల్మాన్‌, రణ్‌బీర్‌లతో ప్రేమ వ్యవహారం నడిపించి..  ఇప్పుడు కత్రినా మరొక హీరోను పెళ్లి చేసుకోబోతోంది అనడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ గా మారింది. తప్పకుండా జనాలు ఎగబడి చూస్తారని ఫుటేజ్ కోసం పలు ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు సమాచారం.

also read: 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే
OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్