
జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత సినారెకు సీఎం కేసీఆర్ ఘనంగా తుదివీడ్కోలు పలికారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో ఉన్న మహాప్రస్థానంలో ఇవాళ జరిగిన సినారె అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. తన అభిమాన కవి అయిన సినారె అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించిన సీఎం అన్నీ తానై సినారే దహన సంస్కార కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించారు. సినారె కవితా శైలిని విశిష్టంగా అభిమానించే సీఎం కేసీఆర్.. అంత్యక్రియల తంతు ముగిసే వరకు మహాప్రస్థానంలోనే ఉన్నారు. సినారె పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు.