
సర్కారు వారి పాట మూవీ షూటింగ్ కి మహేష్ (Mahesh babu)బ్రేక్ ప్రకటించారు. గోవా, హైదరాబాద్ గోవా షెడ్యూల్స్ అనంతరం ఆయన విరామం తీసుకున్నారు. అదే సమయంలో సర్కారు వారి పాట విడుదల కూడా సమ్మర్ కి వాయిదా వేయడం జరిగింది. మొదట జనవరి 14న సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, అనూహ్యంగా ఏప్రిల్ 1న వస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు.
సర్కారు వారి పాట (Sarkaru vaari paata)షూటింగ్ కి మహేష్ బ్రేక్ ప్రకటించడానికి ఆరోగ్య సమస్యలే కారణమంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. కొన్నాళ్లుగా మహేష్ మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్నారని, పరిష్కారంగా సర్జరీ చేయాలని డాక్టర్స్ సూచించారని సదరు కథనాల సారాంశం. సర్జరీ అనంతరం మహేష్ రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందట. అందుకే మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ వాయిదా వేశారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
మహేష్ సడన్ గా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో మహేష్ ఆకస్మిక ప్రయాణం కూడా దాని కోసమే అంటున్నారు. మోకాలి సర్జరీ కోసం మహేష్ అమెరికా వెళుతున్నారంటూ కొన్ని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా విరామం దొరికితే పిల్లలతో పాటు మహేష్ విదేశీ టూర్స్ కి వెళుతూ ఉంటారు. ఈసారి మహేష్, నమ్రతతో పాటు సితార, గౌతమ్ కనిపించలేదు. కాబట్టి ఇది వెకేషన్ ట్రిప్ కాదని అర్థమవుతుంది. దీంతో ప్రచారమవుతున్న పుకార్లకు బలం చేకూరుతుంది. మహేష్ ఆరోగ్యంపై వస్తున్న ఈ పుకార్లు ఫ్యాన్స్ లో ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి.
Also read RRR Trailer: మహేష్ బాబుకే గూస్ బంప్స్ తెప్పించిన ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ అనేశాడు
ఇక దర్శకుడు పరుశురామ్ సర్కారు వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్థిక నేరాలు నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మూవీ తెరకెక్కుతుంది. పూరి మార్క్ హీరోయిజం మహేష్ లో చూస్తారని దర్శకుడు చెప్పిన నేపథ్యంలో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ కి జంటగా కీర్తి సురేష్ (Keerthy Suresh)నటిస్తుండగా... థమన్ సంగీతం అందిస్తున్నారు.
Also read Venkatesh: మహేష్, కమల్, పవన్... వెంకటేష్ తో మల్టీస్టారర్స్ చేసిన హీరోలు ఎవరో తెలుసా!