‘నయీం డైరీస్’మూవీకి హైకోర్టు షాక్

Surya Prakash   | Asianet News
Published : Dec 14, 2021, 09:04 AM IST
‘నయీం డైరీస్’మూవీకి హైకోర్టు షాక్

సారాంశం

నయీం డైరీస్ మూవీ గత శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ మూవీ విడుదలైన సంధ్య థియేటర్ వద్ద బెల్లి లలిత కుటుంబ సభ్యులు తెలంగాణ వాదులు ఆందోళనకు దిగడంతో ప్రదర్శన నిలిచిపోయింది.  

 నయీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘నయీం డైరీస్’ చిత్రానికి హైకోర్టులో చుక్కెదురైంది. నయీం డైరీస్ మూవీలో అసభ్యకర దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారురాలు బెల్లి లలిత కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అభ్యంతకర సన్నివేశాలు తొలగించేవరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
 
ఈ క్రమంలోనే సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించేందుకు తమకు రెండు రోజుల సమయం కావాలని నయీం డైరీస్ సినిమా దర్శకుడు కోర్టును కోరారు. సాధ్యమైనంత త్వరగా ఈ దృశ్యాలను తొలగించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఈ కేసును తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

కాగా నయీం డైరీస్ మూవీ గత శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ మూవీ విడుదలైన సంధ్య థియేటర్ వద్ద బెల్లి లలిత కుటుంబ సభ్యులు తెలంగాణ వాదులు ఆందోళనకు దిగడంతో ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో సినిమా ప్రదర్శన నిలిచిపోయింది.అనంతరం సినిమాపై ఆందోళనకారులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

సినిమాలో బెల్లి లలిత పాత్రను అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ ఆమె కుమారుడు సూర్యప్రకాష్‌ హైకోర్టును ఆశ్రయించారు. 1999లో బెల్లిలలిత దారుణ హత్యకు గురైంది. బెల్లి లలితను నయీం హత్య చేయించాడంటూ అప్పట్లో కుటుంబ సభ్యులు ఆరోపించారు. నయీం డైరీ చిత్రంలో బెల్లి లలిత క్యారెక్టర్ అయిన 'లత'ను నయీం లిప్ కిస్ చేసే దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, ఈ సినిమా శుక్రవారమే విడుదలైంది. దీంతో చిత్రం నిలుపుదల చేయాలంటూ సూర్యప్రకాష్‌ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. చిత్రం డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.  

Also read Pushpa: సమంత ఐటెం సాంగ్ పై కేసు నమోదు.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్

నయీం డైరీస్‌ నిర్మాత సీ.ఏ వరదరాజు బెల్లి లలిత కుటుంబానికి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'సినిమాలో నిజజీవితంలో అమరులైన ఒక మహిళ పాత్రను చిత్రించి ఆమె కుటుంబ సభ్యులను, అభిమానుల్ని బాధపెట్టినట్లు మా దృష్టికి వచ్చింది. వారి మనోభావాల్ని గాయపరిచినందుకు మేము భేషరతుగా క్షమాపణ చెప్తున్నాము. మా సినిమా ప్రదర్శనను ఆపివేసి ఆ పాత్రకు సంబంధించిన అభ్యంతరకర దృశ్యాలను, సంభాషణలను వెంటనే తొలగిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అని నయీం డైరీస్‌ నిర్మాత సీ.ఏ వరదరాజు అన్నారు. నయీం డైరీస్ మూవీలో వశిష్ట సింహ నిఖిల్ దేవాదుల యగ్నశెట్టి సంయుక్త శశికుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. 

Also read Rashmika: సమంత ఐటెమ్‌ సాంగ్‌పై రష్మిక షాకింగ్‌ కామెంట్‌.. వెంటనే మెసేజ్‌ పెట్టిందట.. దానికి సై?

PREV
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?