Allu arjun: ఫ్యాన్స్ మీట్‌లో పలువురికి గాయాలు.. బన్నీ క్షమాపణలు..

By Aithagoni RajuFirst Published Dec 14, 2021, 12:23 AM IST
Highlights

సోమవారం సాయంత్రం కూడా బన్నీ.. తన అభిమానులతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కి భారీగా అభిమానులు తరలి వచ్చారు. 

అల్లు అర్జున్‌(Allu Arjun) నటించిన `పుష్ప` (Pushpa) చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఈ నెల 17న విడుదల కాబోతుంది. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించగా, దీనికి వేలాది మంది తరలి వచ్చారు. చివర్లో అల్లు అర్జున్‌ మాట్లాడే సమయంలో అభిమానులు స్టేజ్‌పైకి వచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని వారిని అదుపు చేసే క్రమంలో లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. 

మరోవైపు సోమవారం సాయంత్రం కూడా బన్నీ.. తన అభిమానులతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కి భారీగా అభిమానులు తరలి వచ్చారు. దీంతో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లు అర్జున్‌తో ఫోటో సెషన్‌ కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ఫ్యాన్‌ మీట్‌ ప్రోగ్రాం క్యాన్సిల్‌ అయ్యిందంటూ నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎన్‌ కన్వెన్షన్‌ గేట్లు విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులను చెదరగొట్టిన పోలీసులు వారిపై లాఠీచార్జ్‌ చేశారు.

ఈ తోపులాటలో పలువురు అభిమానులకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఫ్యాన్‌ మీట్‌ అంటూ నిర్వాహకులు పాసులు సైతం జారీ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకున్న అభిమానులు ఫోటోసెషన్‌ క్యాన్సిల్‌ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసులు ఉన్నా అనూహ్యంగా ప్రోగ్రాం ఎలా క్యాన్సిల్‌ చేస్తారంటూ ఆందోళన చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనలో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. 

ఈ నేపథ్యంలో దీనిపై ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్పందించారు. జరిగిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. `ఈ రోజు సాయంత్రం నిర్వహించిన ఫ్యాన్స్ మీట్‌ ఈవెంట్‌లో పలువురి అభిమానులకు గాయాలయ్యాయని తెలిసింది. నా వ్యక్తిగత టీమ్‌ దానిపై మానిటరింగ్‌ చేస్తుంది. అందుకు సంబంధించిన ప్రతి విషయం తర్వాత నాకు చేరవేస్తున్నారు. వారిని బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాదని నా వైపునుంచి హామీ ఇస్తున్నా. మీ ప్రేమ, అభిమానాలు నాకు పెద్ద అసెట్‌. వారి ప్రేమని ఎప్పుడూ లైట్‌ తీసుకోను` అని తెలిపారు. అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తున్న `పుష్ప` చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. అందులో ప్రమోషనల్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో సమంత ఐటెమ్‌ సాంగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 

pic.twitter.com/dBa4W2B2Qo

— Allu Arjun (@alluarjun)

also read: Rashmika Mandanna: తన టాటూ సీక్రెట్‌ రివీల్‌ చేసిన రష్మిక.. అర్థం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే

click me!