సూపర్ స్టార్ మూవీ శాటిలైట్ హక్కులు 26 కోట్లకు..

Published : Jan 07, 2017, 07:25 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
సూపర్ స్టార్ మూవీ శాటిలైట్ హక్కులు 26 కోట్లకు..

సారాంశం

26 కోట్ల రూపాయలకు మహేష్-మురుగదాస్ మూవీ శాటిలైట్ రైట్స్ సరికొత్త రికార్డులతో హైప్ క్రియేట్ చేస్తున్న సూపర్ స్టార్ మూవీ  

సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న క్రేజ్ మరో సారి రుజువైంది. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మురుగదాస్ డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ జనవరి 8 నుండి అన్నపూర్ణ 7ఏకర్స్ లో జరగనుంది. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత పూణే,డయ్యూలలో జరిగే షెడ్యూల్స్ తో సినిమా కంప్లీట్ చేసి సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలని నిర్మాతలు ఎన్.వీ ప్రసాద్, ‘ఠాగూర్’ మధులు ప్లాన్ చేస్తున్నారు.

 

ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఆశగా ఎదురు చూసిన ఫస్ట్ లుక్ జనవరి చివరి వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. తెలుగు,తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో, హై-టెక్నికల్ స్టాండర్డ్స్ తో నిర్మాణమవుతున్నఈ చిత్రం తాజాగా సూపర్ బిజినెస్ చేసి అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ శాటిలైట్ రైట్ట్ ను ఫాన్సీ ఆఫర్ ఇచ్చి 26 కోట్ల కి  జీ టీవీ సొంతం చేసుకోవడం సరికొత్త రికార్డుగా సంచలనం సృష్టిస్తోంది. మరి మూవీ ఏరేంజ్ లో అలరించనుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 గ్రాండ్‌ ఫినాలే రికార్డ్ రేటింగ్‌.. నాగార్జున ఎమోషనల్‌ పోస్ట్.. ఐదు సీజన్లలో టాప్‌
Emmanuel: బిగ్‌ బాస్‌ షోకి వెళ్తే కామెడీ చేయకండి.. ఇమ్మాన్యుయెల్‌ సంచలన కామెంట్‌.. అందరి ముందు అసహనం