ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు

Published : Jan 06, 2017, 01:30 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు

సారాంశం

మెగా ఈవెంట్ కు మెగా ఏర్పాట్లు గుంటూరు హాయ్ లాండ్ సమీపంలో ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ వేడుకకు హాజరు కానున్న సినీ దిగ్గజాలు దాసరి, రాఘవేంద్రరావు

రేపే మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు గుంటూరు సమీపంలోని హాయ్ లాండ్ లో జరగనుంది. అనుమతుసల కోసం ఎన్నో చర్చల అనంతరం ఈ వేడుక వేదికను గుంటూరు, విజయవాడల మధ్యలోని చినకాకాని వద్ద గల హాయ్ ల్యాండ్ లో ఏర్పాటు చేశారు. మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా నిర్వహించిన టీమ్ ఈ ప్రీ రిలీజ్ వేడుకను కూడా భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేసింది.

 

అందుకే హాయ్ ల్యాండ్ ప్రాంగణంలో భారీ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ సహా మెగా హీరోలు, ఇతర ముఖ్య సెలబ్రిటీలు హాజరుతుండటంతో పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. వేడుకను చూసేందుకు, మెగాస్టార్ కు వెల్కమ్ చెప్పనందుకు హాజరుకానున్న వేల మంది అభిమానులు కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా దర్శకులు రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు హాజరుకానున్నారు.

 

అభిమానుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు

 

దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత మెగాస్టార్ త‌ను న‌టించిన సినిమా సాక్షిగా అభిమానుల ముందు ప్ర‌సంగించేందుకు వ‌స్తున్నారు. ఆ కిక్కు మెగా ఫ్యాన్స్‌లో ఓ రేంజులో క‌నిపిస్తోంది. హాయ్‌ల్యాండ్‌లో మెగా ఫ్యాన్స్ ఒక‌టే హ‌ల్‌చ‌ల్.

మెగాస్టార్‌ని క‌నులారా వీక్షించేందుకు.. ద‌గ్గ‌ర‌గా చూసుకునేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి, ఇత‌ర రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు త‌ర‌లి వ‌స్తున్నారు. అయితే ఎంత పెద్ద స్థాయిలో అభిమానులు వ‌చ్చినా ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా వేదిక ప‌రిస‌రాల్లో ఏర్పాట్లు చేశారు. ప్రాంగ‌ణం కిక్కిరిసినా ఎలాంటి తోపులాట‌లు త‌లెత్త‌కుండా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత బాస్ ఇలా ఓ సినిమా వేదిక‌పైకి, త‌న‌ అభిమానుల ముందుకు వ‌స్తున్నారు.. కాబ‌ట్టి ఇంత పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ వేదిక రాజ‌కీయ ప్ర‌సంగాల‌కు అతీతం. ఇది పూర్తిగా సినిమాకి సంబంధించిన వేదిక కాబ‌ట్టి అభిమానులు అంతే ఉత్సాహంగా బాస్ రాక‌కోసం ఇప్ప‌టి నుంచే ఆత్రంగా, ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ శ‌నివారం సాయంత్రం అభిమానుల ఉత్కంఠ‌కు తెర‌ప‌డ‌నుంది. సాయంత్రం 5 గంట‌ల నుంచి హాయ్‌ల్యాండ్‌లో మెగా సంబ‌రాలు మిన్నంట‌నున్నాయి. మెగాస్టార్ ఉత్కంఠ రేకెత్తించే స్పీచ్‌తో అల‌రించేందుకు ఇంకెంతో టైమ్ లేదు. జ‌స్ట్ వెయిట్‌.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చావు దగ్గర పడినట్లు మాట్లాడిన సుమిత్ర
విజయ్ దేవరకొండ డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టా లేనట్టా? రౌడీ హీరో అభిమానులకు కు షాకింగ్ న్యూస్..