
సంక్రాంతి బరిలో ఇటు మెగా స్టార్ అటు నందమూరి నటసింహం నిలవటంతో ఇతర సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొంది. రెడ్ స్టార్ నారాయణ మూర్తి నటించిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా సంక్రాంతి రిలీజ్ కు ప్లాన్ చేశారు. అయితే ఎక్కడా ధియేటర్లు అందుబాట్లో లేకపోవడంతో నారాయణమూర్తి చాలా పీలవుతున్నాడు.
సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి , నటసింహం నందమూరి బాలకృష్ణ ల చిత్రాలు ఖైదీ నెంబర్ 150 , గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు రెడ్ స్టార్ ఆర్ . నారాయణమూర్తి . సంక్రాంతి బరిలో ఆ రెండు చిత్రాలు రిలీజ్ అవుతుండటం తో పాపం ఆర్ . నారాయణమూర్తి నటించిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాకు థియేటర్ లు దొరకని పరిస్థితి అందుకే ఆ ఇద్దరి పై ఆగ్రహంగా ఉన్నాడు రెడ్ స్టార్.
ఉన్న థియేటర్ లన్నీ పెద్ద సినిమాలకే ఇస్తే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ? అని ఫైర్ అవుతున్నాడు . జనవరి 13న హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ థియేటర్ లు దొరక్క పోవడంతో జనవరి 14 కు వాయిదా వేశారు . చిరంజీవి ,బాలకృష్ణ చిత్రాలతో పాటు శతమానం భవతి చిత్రం కూడా రిలీజ్ అవుతున్నందున ఆర్ . నారాయణమూర్తి చిత్రానికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే థియేటర్ లు లభించనున్నాయి అది కూడా పాత బడిన థియేటర్ లు తప్ప మంచి థియేటర్ లు దొరకడం చాలా చాలా కష్టం. మొత్తానికి మెగాస్టార్, నటసింహం ఇద్దరూ కలిసి చిన్న సినిమాలను సంక్రాంతి పండుగకు మెగా నలుపుడు నలిపేస్తారేమో.