Sarkaru Vaari Paata Updates: సంక్రాంతి నుండి సర్కారు వారి పాట సందడి షురూ...

Published : Jan 06, 2022, 03:41 PM ISTUpdated : Jan 10, 2022, 07:55 PM IST
Sarkaru Vaari Paata Updates: సంక్రాంతి నుండి సర్కారు వారి పాట సందడి షురూ...

సారాంశం

సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రాన్ని సమ్మర్ కి షిఫ్ట్ చేశారు. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. త్వరలో లేటెస్ట్ షెడ్యూల్ సెట్స్ పైకి వెళ్ళనుంది. 


వరుస బ్లాక్ బస్టర్స్ తో జోరు మీదున్నారు సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu). 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది. మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన సరిలేరు నీకెవ్వరు టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా రికార్డులకు ఎక్కింది. ఈ మూవీ తరువాత మహేష్ చేస్తున్న మరో మాస్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. గీత గోవిందం మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న పరుశురాం పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రాన్ని సమ్మర్ కి షిఫ్ట్ చేశారు. ఏప్రిల్ 1న సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. త్వరలో లేటెస్ట్ షెడ్యూల్ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక సంక్రాంతి నుండి సర్కారు వారి పాట అప్డేట్స్ షురూ చేయనున్నారట. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ మధ్య సినిమా ప్రమోషన్స్ విషయంలో ట్రెండ్ మారింది. ఒకప్పుడు విడుదలకు ఓ నెల ముందు నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేసేవారు. 

అలా కాకుండా విడుదలకు మూడు నాలుగు నెలల ముందు నుండే ప్రమోషన్స్ పై దృష్టి పెడుతున్నాయి. ఫలితం ఏదైనా భారీ ప్రమోషన్స్ సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయి. భారీ బడ్జెట్ సినిమాలకు ఓపెనింగ్స్ చాలా కీలకం. అందుకే స్టార్ హీరోల సినిమాలను ఖర్చుకు వెనుకాడకుండా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. సర్కారు వారి పాట చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మహేష్ కోసం థమన్ ట్యూన్స్ సిద్ధం చేశారని వినికిడి. 

మరి పెద్ద పండుగ సంక్రాంతి (Sankranthi 2022) నాడు మహేష్ ఫ్యాన్స్ కోసం యూనిట్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి. సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత మహేష్ చాలా కథలు విన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లితో ప్రాజెక్ట్ దాదాపు ఖాయం చేశారు. కారణం ఏమిటో కానీ చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ చేశారు. చాలా మంది దర్శకుల కథలు విన్న అనంతరం పరుశురాం కి అవకాశం ఇచ్చారు. 

Also read Mahesh Babu-Samantha: మహేష్ బాబుతో సమంతను కలపాలని చూస్తున్న త్రివిక్రమ్.. వర్కౌట్ అవుతుందా..?

పరుశురాం అంతగా మహేష్ ని ఆకట్టుకోవడానికి గల కారణం ఏమిటో విడుదల తర్వాత తెలియనుంది. ఇక సర్కారు వారి పాట బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో తెరకెక్కుతుందని సమాచారం.ఇటీవల మహేష్ సర్కారు వారి పాట షూట్ కి విరామం ప్రకటించారు. ఆయన ఫ్యామిలీతో పాటు దుబాయ్ వెళ్లడం జరిగింది. త్వరలో సర్కారు వారి పాట లేటెస్ట్ షెడ్యూల్ మొదలుకానుంది. సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ (Keerthy Suresh)హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ లుక్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌