Akhanda- Boyapati Remuneration:అఖండ హిట్.. బోయపాటికి డబుల్ రెమ్యూనరేషన్!

By Sambi ReddyFirst Published Jan 6, 2022, 2:38 PM IST
Highlights

అఖండ (Akhanda)ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భావించిన బోయపాటి నిర్మాత మిర్యాల రవీంధర్ రెడ్డి తో రెమ్యూనరేషన్ గా లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. నాలుగు వారాలు నిరవధికంగా అఖండ థియేటర్స్ లో సందడి చేస్తూనే ఉంది.

బాలయ్య కెరీర్ లో బోయపాటి శ్రీను (Boyapti Sreenu) ప్రత్యేక దర్శకుడిగా మారిపోయారు. గతంలో బి. గోపాల్-బాలయ్య సినిమాలు బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఆ తర్వాత బాలయ్యకు ఆ స్థాయి హిట్స్ అందించిన దర్శకుడిగా బోయపాటి నిలిచారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్స్ విజయాలు నమోదు చేశాయి. అఖండ తో హ్యాట్రిక్ పూర్తి చేశారు. అదే సమయంలో అఖండ హిట్ బాలయ్యకు చాలా ప్రత్యేకం. అట్టర్ ప్లాప్స్ తో బాలయ్య సినిమాలు కనీస వసూళ్లు దక్కించుకోలేని పరిస్థితి నెలకొంది. 

ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన బాలయ్య (Balakrishna)సినిమాలకు వస్తున్న వసూళ్ళు చూసి ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అసలు బాలయ్య ఇకపై సినిమాలు చేయాలా? మానేయాలా? అని పరిస్థితి ఎదురైంది. అలాంటి తరుణంలో అఖండ... బాలయ్యకు పునర్వైభవం తీసుకు వచ్చింది. ఇక తన కథ, టేకింగ్ పై నమ్మకం ఉంచిన బోయపాటి శ్రీను సైతం అఖండ హిట్ తో భారీగా ఆర్జించినట్లు సమాచారం అందుతుంది. 

అఖండ (Akhanda)ఖచ్చితంగా విజయం సాధిస్తుందని భావించిన బోయపాటి నిర్మాత మిర్యాల రవీంధర్ రెడ్డి తో రెమ్యూనరేషన్ గా లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. నాలుగు వారాలు నిరవధికంగా అఖండ థియేటర్స్ లో సందడి చేస్తూనే ఉంది. వరల్డ్ వైడ్ గా అఖండ రూ. 115 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కాగా రూ. 50 కోట్ల బడ్జెట్ తో అఖండ తెరకెక్కించారట. ఊహకు మించిన విజయం సాధించిన అఖండ బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. 

నిర్మాత మిర్యాల రవీంధర్ రెడ్డి కూడా మంచి లాభాలు ఆర్జించారు. ఇక డిజిటల్ రైట్స్ ద్వారా రూ. 20 కోట్ల రూపాయల వరకు దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే శాటిలైట్ రైట్స్ ద్వారా మరికొంత రానుంది. మొత్తంగా అఖండ మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ గా నిలిచింది. ఇక రెమ్యూనరేషన్ గా లాభాల్లో వాటా తీసుకున్న బోయపాటికి రూ. 15 కోట్ల వరకు ముట్టినట్లు సమాచారం. సాధారణంగా బోయపాటి సినిమాకు రూ. 8-9 కోట్లు తీసుకుంటారు. పదిహేను కోట్లు అంటే ఆయన దాదాపు డబుల్ రెమ్యూనరేషన్ దక్కినట్లయింది. 

ఇక అఖండ సంక్రాంతి కానుకగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని అందరూ భావించారు. అయితే జనవరి 21 నుండి అఖండ ఓటిటిలో అందుబాటులోకి రానుందని అధికారిక సమాచారం. అఖండ డిజిటల్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు హాట్ స్టార్ ప్రతినిధులు సమాధానం చెప్పారు. జనవరి 21నుండి అఖండ స్ట్రీమ్ కానున్నట్లు వెల్లడించారు. బాలయ్య బుల్లితెరపై సంక్రాంతికి సందడి చేస్తాడు అనుకుంటే... అది జరగలేదు. 

Also read Akhanda OTT :'అఖండ'ఓటీటి రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన,సంక్రాంతి కి కాదు

సంక్రాంతి బరిలో పెద్ద చిత్రాల లేకపోవడంతో పండగ సీజన్ కూడా క్యాష్ చేసుకోవాలనేది నిర్మాతల ఆలోచన కావచ్చు. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ ఓ వారం వెనక్కి జరిపి ఉంటారు. సాధారణంగా మూవీ విడుదలైన నాలుగు వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుంది. బంగార్రాజు ఒక్కటే సంక్రాంతి (Sankranthi 2022)కి విడుదలవుతున్న పెద్ద చిత్రం. ఈ నేపథ్యంలో పుష్ప, అఖండ చెప్పుకోదగ్గ వసూళ్లు అందుకునే ఆస్కారం కలదు. 

Also read Akhanda OTT rights: బాలయ్య అఖండ ఓటిటి రైట్స్ కి భారీ ఆఫర్... నిర్మాతకు కాసుల పంట!
 

click me!