నేనిలా ఉంటే నీకేమైనా నొప్పా..? మాధవీలత ఫైర్!

Published : Oct 17, 2018, 09:11 AM ISTUpdated : Oct 17, 2018, 09:14 AM IST
నేనిలా ఉంటే నీకేమైనా నొప్పా..? మాధవీలత ఫైర్!

సారాంశం

నటి మాధవీలత తన బోల్డ్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ పై ఆమె విరుచుకుపడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల ఆమె బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు

నటి మాధవీలత తన బోల్డ్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ పై ఆమె విరుచుకుపడడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల ఆమె బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

అయితే చాలా మంది నెటిజన్లు ఆమె హైట్ ని వెక్కిరిస్తూ పొట్టిది పొట్టిది అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మండిపడ్డ మాధవీలత ఫేస్ బుక్ లైవ్ కి వచ్చి తనను కామెంట్ చేసిన వాళ్లని ఇష్టమొచ్చినట్లుగా తిట్టేసింది.

''నేను శ్రీనగర్ కాలనీలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న వీడియోలను అభిమానులతో షేర్ చేసుకున్నాను. అయితే చాలా మంది నన్ను పొట్టిది అంటూ కామెంట్స్  పెడుతున్నారు. అవునా బై నేను పొట్టిగానే ఉంటా.. నీకేమైనా నొప్పొచ్చిందా..? నీకేమైనా మాయరోగం వచ్చిందా..? నీకేమైనా పొయ్యేకాలం వచ్చిందా..? లేదు కదా..? మీ ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి అందరూ పొడవుగా ఉన్నారు కదా.. ఇంక సంతోషంగా ఉండు..

నాకు లేనిది మీకు ఉన్నందుకు సంతోషించండి.. నా మీద పడి ఎందుకు ఏడుస్తారు..? నేను పొట్టిగా ఉన్నందుకు ఎవరికైనా నొప్పిగా ఉంటే వెళ్లి డాక్టర్ కి చూపించుకోండి. అది శాడిస్టిక్ డిసీజ్ అనుకుంటా.. వెళ్లి ట్రీట్మెంట్ తీస్కో.. ఫోటో నచ్చితే నచ్చినట్లు ఉండాలి.. లేకపోతే లేదు. అంతేకాని నేను పొట్టిగా ఉంటే నీకేంటి..? నల్లగా ఉంటే నీకేంటి..? నీకు నచ్చకపోతే నా పేజ్ నుండి వెళ్లిపో'' అంటూ ఘాటు సమాధానమిచ్చింది. 

ఇది కూడా చూడండి..

ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల సీఎం అవుతారంటే చిరు అయ్యేవారు కదా..? (వీడియో)

PREV
click me!

Recommended Stories

విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్