MAA Elections :ప్రకాష్ రాజ్ క్రమశిక్షణ లేని నటుడు, మంచు విష్ణుకే ఆ అర్హత ఉంది.. కోటా సంచలన కామెంట్స్

By team telugu  |  First Published Oct 8, 2021, 2:56 PM IST

తమకు మద్దతుగా ఉన్న కోటాను మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కోటా శ్రీనివాసరావు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ప్రకాష్ రాజ్ పై సంచలన కామెంట్స్ చేశారు.తమకు మద్దతుగా ఉన్న కోటాను మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కోటా శ్రీనివాసరావు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబును ఉద్దేశిస్తూ.. 'మీరు మా అబ్బాయికి ఓటు వేయమని అడగడం ఏమిటండి... అతనికి ఆ అర్హత ఉంది' అన్నారు కోటా.  ఇక ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని నటుడిగా నేను మాట్లాడను .అతనితో నేను కనీసం 15 సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశాను... ఒక్కరోజు కూడా అతను షూటింగ్ కి సమయానికి రాలేదు... ప్రకాష్ రాజ్ క్రమశిక్షణ లేని వాడు, ఆలోచించుకొని ఓటు వేయండి అన్నారు. 
 

Also read శ్రీకృష్ణ పాత్రధారి అంటూ నరేష్ ని టార్గెట్ చేసిన నాగబాబు.. పవన్ విషయంలో తొలిసారి విష్ణుకి కౌంటర్

Latest Videos

నేను ఎప్పుడూ నేషనల్ లెవెల్ ఆర్టిస్ట్ అని, అనేక అవార్డ్స్ వచ్చాయని చెప్పుకోలేదు అన్నారు. లోకల్ నాన్ లోకల్ అనేది అనవసరం. మంచు విష్ణుకు సమర్ధత, అర్హత ఉంది. ఎన్నికలలో నిలుచున్నాడు, ఓట్లు వేసి గెలిపించుకుంటాము, అని కోటా గట్టిగా చెప్పారు. అందరికీ చెప్పి విష్ణుకు  ఓట్లు వేయించాలని, ఆయనను గెలిపించాలని ప్రార్ధన చేస్తున్నా, అంటూ ముగించారు. 

Also read ఎన్టీఆర్ మీకు ఓటు వేయలేను అన్నారు... జీవిత రాజశేఖర్ సంచలన కామెంట్స్


ఇక చాలా కాలంగా కోటా శ్రీనివాసరావు అవకాశాల విషయంలో తెలుగువారికే మొదట ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు. అదే క్రమంలో తెలుగువాడైన మంచు విష్ణుకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాగా నిన్న నాగబాబు కోటా పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ గొప్ప నటుడన్న విషయాన్ని వీరు ఒప్పుకోరని, ఆయన గొప్పేంటి అంటారని ఆరోపణలు చేశారు. కోటా లాంటి ఆర్టిస్ట్స్ సంకుచిత భావాలు కలిగి ఉన్నారని, అవి వదిలేయాలని సటైర్స్ విసిరారు. 
 

click me!