MAA Elections : నా ఓటు వాళ్లకే, కాంట్రవర్సీ విషయాలపై మాట్లాడను... రోజా కామెంట్స్

By team telugu  |  First Published Oct 8, 2021, 2:21 PM IST

ఆర్ కె రోజా MAA elections గురించి మాట్లాడారు. తన ఓటు ఎవరికో కూడా తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ ఇరు ప్యానెల్స్ మ్యానిఫెస్టోలు చూశానని, మా సభ్యుల సంక్షేమం, అభివృద్ధి ఎవరి వలన అవుతుందో వారికే తన ఓటు అన్నారు.


మా ఎన్నికల బరిలో నిలిచిన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. అక్టోబర్ 10న ఎన్నికల నేపథ్యంలో  ప్రత్యర్ధులు ఇద్దరూ ప్రచారంలో మునిగిపోయారు . సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్న మా ఎలక్షన్స్ నటుల మధ్య ఎంత పెద్ద రచ్చకు దారితీశాయో చూస్తూనే ఉన్నాం. ఇక కొందరు సీనియర్ నటులు మా ఎన్నికలపై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


తాజాగా నటి ఆర్ కె రోజా MAA elections గురించి మాట్లాడారు. తన ఓటు ఎవరికో కూడా తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ ఇరు ప్యానెల్స్ మ్యానిఫెస్టోలు చూశానని, మా సభ్యుల సంక్షేమం, అభివృద్ధి ఎవరి వలన అవుతుందో వారికే తన ఓటు అన్నారు. లోకల్ నాన్ లోకల్ అనే వాదన తెరపైకి వచ్చింది... మీ ఓటు లోకల్ కా, నాన్ లోకల్ కా? అని అడుగగా... కాంట్రవర్సీ విషయాలపై స్పందించను అన్నారు రోజా. 

Latest Videos

Also read ప్రకాష్ రాజ్ విషయంలో నాగబాబు రెండు నాల్కల ధోరణి... ఆ విషయంలో అడ్డంగా బుక్కయ్యాడు!


మా ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయని, కాబట్టి వివాదాస్పద అంశాల గురించి మాట్లాడను అని RK Roja అన్నారు. మా సభ్యులకు ఎవరు మంచి చేస్తారని భవిస్తానో వారికే ఓటు వేస్తాను అన్నారు. ఇక ఓటింగ్ లో పాల్గొంటానని, తన ఓటు సద్వినియోగం చేసుకుంటానని రోజా తెలిపారు. ఇప్పటికే రాజీవ్ కనకాల, మురళీమోహన్, రవి బాబు, కోటా శ్రీనివాసరావు తమ ఓటు మంచు విష్ణుకు అని ఓపెన్ గా చెప్పారు. అధ్యక్ష బరిలో నిలిచి, వెనక్కి తగ్గినా సి విల్ ఎల్ నరసింహారావు.. ప్రకాష్ రాజ్ కి ఓటు వేయవద్దని మీడియా వేదికగా చెప్పిన విషయం తెలిసిందే.  

మా పొలిటికల్ ఎన్నికలకన్నా వాడిగా వేడిగా MAA ఎన్నికలు జరుగుతున్నాయి... వారికే నా ఓటు: మా ఎన్నికలపై రోజా సంచలన కామెంట్స్..! pic.twitter.com/ONfnmME6fA

— Asianetnews Telugu (@AsianetNewsTL)
click me!