ఎన్టీఆర్ తో సమంత ఆట.. క్రేజీ న్యూస్, విడాకుల తర్వాత తొలిసారి..

pratap reddy   | Asianet News
Published : Oct 08, 2021, 02:49 PM IST
ఎన్టీఆర్ తో సమంత ఆట..  క్రేజీ న్యూస్, విడాకుల తర్వాత తొలిసారి..

సారాంశం

ప్రస్తుతం  టాలీవుడ్ లో ఎక్కువగా నాగ చైతన్య, సమంత గురించే చర్చ జరుగుతోంది. ఊహించని విధంగా చై సామ్ విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం  టాలీవుడ్ లో ఎక్కువగా నాగ చైతన్య, సమంత గురించే చర్చ జరుగుతోంది. ఊహించని విధంగా చై సామ్ విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోవడంపై అనేక రకాల కారణాలు చూపుతూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా సమంత ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ నర్మగర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతోంది. 

ఇదంతా పక్కన పెడితే Samantha గురించి ఓ ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది. సమంత త్వరలో ఎవరు మీలో కోటీశ్వరులు షోకి అతిథిగా హాజరు కాబోతోందట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రముఖ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం అవుతోంది. అమితాబ్ కేబీసీ తరహాలో ఎవరు మీలో కోటీశ్వరులు షో అలరిస్తోంది. 

ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి ఇప్పటికే రాంచరణ్, రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా హాజరయ్యారు. త్వరలో మహేష్ బాబు కూడా ఈ షోలో పాల్గొనబోతున్నాడు. మహేష్ పాల్గొనబోయే షో దసరాకు ప్రసారం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

Also Read: నాగ చైతన్య నుంచి సమంత భరణం తీసుకోవడం లేదా.. కారణాలు ఇవే ?

ఇక సమంత హాజరైన షో కూడా షూటింగ్ పూర్తయ్యిందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఎన్టీఆర్, సమంత ఆన్ స్క్రీన్ పై పర్ఫెక్ట్ జోడి. వీరిద్దరూ జంటగా బృందావనం, జనతా గ్యారేజ్, రామయ్య వస్తావయ్యా, రభస చిత్రాల్లో నటించారు. ఇందులో జనతా గ్యారేజ్, బృందావనం చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. 

సెలెబ్రిటీలతో జోకులు వేస్తూ ఎన్టీఆర్ సరదాగా ఈ షోని నడిపిస్తున్నాడు. సమంత లాంటి క్రేజీ హీరోయిన్ హాజరైతే టిఆర్పి అమాంతం పెరగడం ఖాయం. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు