MAA elections:మా చరిత్రలోనే ఎక్కువ పోలింగ్... విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న మంచు విష్ణు

By team teluguFirst Published Oct 10, 2021, 2:35 PM IST
Highlights

ఈసారి ఎన్నికలో ఆ సంఖ్య ఏకంగా 600 కి చేరింది. 600 మించి ఓట్లు నమోదు అవుతాయని తెలుస్తుంది. ఇతర పరిశ్రమలకు చెందిన నిత్యామీనన్, ప్రియమణి, జెనిలియా వంటి హీరోయిన్స్ ఎన్నికల్లో పాల్గొనడం విశేషం. మరో వైపు మంచు విష్ణు ప్యానెల్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

2021 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు చాలా ప్రత్యేకం. సాధారణ ఎన్నికలకు మించిన హైడ్రామా , కాంట్రవర్సీ ఈసారి నడిచింది. ప్రకాష్ రాజ్ తాను అధ్యక్ష బరిలో దిగుతున్నాను అంటూ ప్రకటన చేయడంతోనే రచ్చ మొదలైంది. ఎన్నికలకు రెండు నెల్ల ముందే మొత్తం 27 మంది సభ్యులతో ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ ప్రకటించారు. దీని కొరకు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక నాగబాబు గత రెండేళ్లుగా మా ప్రతిష్ట మసకబారింది అనడం వివాదాస్పదం అయ్యింది. 


దీనికి నరేష్ ఓ ప్రెస్ మీట్ పెట్టడం, నాగబాబు, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మొదలైన ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఏదిఏమైనా మా ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరి కాసేపట్లో ఎలక్షన్ ముగియనుంది. అయితే చరిత్రలోనే మొదటిసారి అత్యధిక ఓటింగ్ నమోదు కావడం జరిగింది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఏనాడూ కూడా 500 మించి ఓట్లు పోల్ కాలేదు. 

Also read MAA elections: ఇంకా యాభై శాతం కూడా జరగిని పోలింగ్.. ఎన్ని ఓట్లు పోలైయ్యాయంటే!


ఈసారి ఎన్నికలో ఆ సంఖ్య ఏకంగా 600 కి చేరింది. 600 మించి ఓట్లు నమోదు అవుతాయని తెలుస్తుంది. ఇతర పరిశ్రమలకు చెందిన నిత్యామీనన్, ప్రియమణి, జెనిలియా వంటి హీరోయిన్స్ ఎన్నికల్లో పాల్గొనడం విశేషం. మరో వైపు మంచు విష్ణు ప్యానెల్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


మంచు విష్ణుతో పాటు మీడియా ముందుకు వచ్చిన మోహన్ బాబు. ఇంకా సినిమా రిలీజ్ కాలేదని, అప్పుడే విజయం డిక్లేర్ చేయకూడదు అన్నారు. దేవుడు, ఓటర్ల దయతో మేము గెలబోతున్నాం అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న మా సభ్యులు, ఇప్పటికే పూలమాల వేసి విష్ణును సత్కరించి... విజయాన్ని ధృవీకరించినట్లు సమాచర్మం. ఇదిలా ఉంటే పోలింగ్ కేంద్రంలో దుర్గ్మర్గులు రిగ్గింగుకి పాల్పడుతున్నారు అని నాగబాబు కామెంట్స్ చేయడం కొసమెరుపు. 
 

click me!