MAA elections: అందుకే శివబాలాజీ చేయి కొరికినాను, దురుద్దేశం ఏమీ లేదు... నటి హేమ వివరణ

Published : Oct 10, 2021, 02:04 PM ISTUpdated : Oct 10, 2021, 02:38 PM IST
MAA elections: అందుకే శివబాలాజీ చేయి కొరికినాను, దురుద్దేశం ఏమీ లేదు... నటి హేమ వివరణ

సారాంశం

తాను పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో శివ బాలాజీ చేయి అడ్డుగా పెట్టారని.. తప్పుకోమంటే తప్పుకోలేదని హేమ చెప్పారు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో చేయి కొరకాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 


పోలింగ్ కేంద్రంలో హేమ తన చేయి కొరికింది అని శివ బాలాజీ కంప్లైంట్ చేయడం సంచలనంగా మారింది. నరేశ్ తో పాటు మీడియా ముందుకు వచ్చిన శివ బాలాజీ.. హేమ నోటితో చేతిని కొరకారని గాయం చూపించడం జరిగింది. ఈ విషయం మీడియాలో హైలైట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో హేమ వివరణ ఇచ్చారు. 

తాను పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న సమయంలో శివ బాలాజీ చేయి అడ్డుగా పెట్టారని.. తప్పుకోమంటే తప్పుకోలేదని హేమ చెప్పారు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో  చేయి కొరకాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అంతే తప్ప దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

మంచు విష్ణు ప్యానెల్ నుండి శివబాలాజీ ట్రెజరర్ గా పోటీ చేస్తుండగా, ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి హేమ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీపడుతున్నారు. ఎన్నికలు మొదలైన నాటి నుండి నటి హేమ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ పై అనేక ఆరోపణలు చేశారు. 

Also read MAA elections: అందుకే శివబాలాజీ చేయి కొరికినాను, దురుద్దేశం ఏమీ లేదు... నటి హేమ వివరణ


ఇక దాదాపు ఓటింగ్ సమయం ముగుస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం దాదాపు 500 ఓట్లు వరకు పాలైయ్యాయని సమాచారం. పోటీలో నిలిచిన ఇరు ప్యానెల్స్ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చికంగా మా ప్యానెల్ విజయం సాధిస్తుంది అంటూ.. ధీమాగా చెబుతున్నారు. ఇంత హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో విజేత ఎవరనేది మరి కొన్ని గంటలలో తేలిపోనుంది. 
 

PREV
click me!

Recommended Stories

2025లో బెస్ట్ మూవీస్ లో ఒకటి, ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఓటీటీలోకి..
Anasuya బట్టలపై కొడుకు కామెంట్.. సొంత కొడుకని కూడా చూడలేదు, ఇచ్చిపడేసిన మాజీ యాంకర్‌