MAA Elections: ముంబై నుంచి ఓటు వేయడానికి వచ్చిన జెనీలియా.. ప్రకాష్ రాజ్ కి షాక్

By telugu teamFirst Published Oct 10, 2021, 1:58 PM IST
Highlights

అనేక మలుపులు, వివాదాలు, వాదోపవాదాల అనంతరం మా ఎన్నికల అంశం చివరిదశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో ఎన్నిక ముగియనుంది. ఇక ఓట్ల లెక్కింపు, విజేతని ప్రకటించడమే మిగిలి ఉంటుంది.

అనేక మలుపులు, వివాదాలు, వాదోపవాదాల అనంతరం మా ఎన్నికల అంశం చివరిదశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో ఎన్నిక ముగియనుంది. ఇక ఓట్ల లెక్కింపు, విజేతని ప్రకటించడమే మిగిలి ఉంటుంది. నేటి ఉదయం 8 గంటల నుంచి మా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

ఈ ఉదయం నుంచే టాలీవుడ్ సెలెబ్రిటీలు పవన్, చిరు, బాలయ్య, సుమన్, సాయి కుమార్, నిత్యా మీనన్, రామ్ చరణ్ లాంటి వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య గొడవలతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

హేమ.. శివ బాలాజీని కొరకడం.. మోహన్ బాబు బెనర్జీకి వార్నింగ్ ఇవ్వడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఓ ఆసక్తికర సంఘటన కూడా చోటు చేసుకుంది. ముంబైలో సెటిల్ అయిపోయి సినిమాలకు దూరంగా భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న జెనీలియా కూడా ఓటు వేయడానికి వచ్చింది. ముంబై నుంచి ఆమె ఓటు వేయడానికి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. 

పోలింగ్ కేంద్రం వద్ద జెనీలియా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విష్ణు, జెనీలియా ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ఇద్దరూ చాలా సంతోషంగా కనిపించారు. ఇదంతా చూస్తుంటే జెనీలియా ఓటు విష్ణుకే అని స్పష్టంగా అర్థం అవుతోంది. టాలీవుడ్ నాకు మరో ఇల్లు లాంటిది. త్వరలో మా అసోసియేషన్ కి సూపర్ ప్రెసిడెంట్ రాబోతున్నాడు అంటూ పరోక్షంగా విష్ణు గురించి తెలిపింది. 

Also Read: MAA Elections: శివ బాలాజీ చేయి కొరికేసిన హేమ..

విష్ణు, Genelia D'Souza మంచి స్నేహితులు. వీరిద్దరూ జంటగా బ్లాక్ బస్టర్ మూవీ 'ఢీ'లో నటించారు. విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అదే. ఇదిలా ఉండగా జెనీలియా ఓటింగ్ కి రావడం ఒకరకంగా ప్రకాష్ రాజ్ కి షాకింగ్ అని చెప్పాలి. కొన్ని రోజుల క్రితం ప్రకాష్ రాజ్ ఓ సమావేశంలో జెనీలియా గురించి కామెంట్స్ చేశాడు. 

మాలో 900 మంది పైగా సభ్యులు ఉన్నారని అంటున్నారు. అది వాస్తవం కాదు. జెనీలియా లాంటి వాళ్ళు సీఎం కొడుకుని పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అయిపోయింది. అలాంటి వారంతా మాలో యాక్టివ్ మెంబర్స్ కాదు అని ప్రకాష్ రాజ్ అన్నారు. కానీ ఇప్పుడు జెనీలియా స్వయంగా ముంబై నుంచి వచ్చి ఓటు వేసింది. 

click me!