MAA elections: ఎన్నికల రగడ.. కోర్ట్ కి వెళతానంటున్న యాంకర్ అనసూయ!

By team teluguFirst Published Oct 13, 2021, 9:57 AM IST
Highlights

 
ప్రెస్ మీట్ ముగిసిన తరువాత యాంకర్ అనసూయను మీడియా చుట్టుముట్టింది. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని మీరు ట్వీట్ చేశారు కదా? కారణం?, అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న అనసూయను గందరగోళంలోకి నెట్టింది. 

యాంకర్ అనసూయ మీడియా పై ఫైర్ అయ్యారు. తన పేరును వాడుతూ తప్పుడు కథనాలు రాస్తే కోర్టుకు వెళతా అన్నారు. వివరాల్లోకి వెళితే..  MAA elections నిర్వహణ, ఫలితాలపై అసహనం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు నిన్న ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. తన ప్యానెల్ తరుపున గెలిచిన 11 మంది సభ్యులు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు prakash raj ప్రకటించారు. క్రాస్ ఓటింగ్ కారణంగా ఇరు ప్యానెల్స్ నుండి సభ్యులు ఎంపికయ్యారు. దీనివల్ల ఎవరూ స్వేచ్ఛగా పని చేయలేరు. అభిప్రాయ బేధాలు వస్తాయని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలిచిన శ్రీకాంత్ అన్నారు. అందుకే మా సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

 ప్రెస్ మీట్ ముగిసిన తరువాత యాంకర్ అనసూయను మీడియా చుట్టుముట్టింది. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని మీరు ట్వీట్స్ చేశారు కదా? కారణం?, అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న అనసూయను గందరగోళంలోకి నెట్టింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని నేను అనలేదు. నాకు వచ్చిన సందేహాన్ని ట్వీట్ రూపంలో పంచుకున్నాను అన్నారు. ఎన్నికల రోజు  భారీ మెజారిటీతో గెలిచానని మీరే(మీడియా)కదా చెప్పారు. నేను ప్రకటించుకోలేదు అన్నారు. 

ఎన్నికలు జరిగిన రాత్రి గెలిచానని చెప్పి, ఆ మరుసటిరోజు ఓడిపోయానని అన్నారు. ఆ విషయంపై నేను స్పందిస్తూ ట్వీట్స్ వేశాను. అంతే కానీ మా ఎన్నికలలో అవకతవకలు జరిగాయని నేను అనలేదు అన్నారు. మీ ట్వీట్స్ సారాంశం అదే కదా.. అనగా Anasuya ఫైర్ అయ్యారు. ఉన్న న్యూస్ రాయండి, సృష్టించవద్దు.. ఈ సంధర్భంగా అన్ని మీడియా మాధ్యమాలకు నేను చెప్పేది ఒకటే.. నా పేరు వాడి లేనిపోని కథనాలు రాస్తే కోర్టుకు వెళతా.. అంటూ హెచ్చరించారు. అనంతరం అక్కడ నుండి కోపంగా వెళ్లిపోయారు. 

Also read నరేష్‌ని చాణక్యుడితో పోల్చిన సమీర్‌.. ఆయన ఉంటే పనులు జరగవు.. మాకు సెట్‌ కాదంటోన్న శ్రీకాంత్‌..
అనసూయ ఓడిపోయారనే ప్రకటన వెలువడిన తరువాత  వరుస ట్వీట్స్ తో విరుచుకుపడ్డారు. 'నేను ఎప్పుడూ రాజకీయాల్లో ఇన్‌వాల్వ్ కాలేనని తెలిపింది. రాజకీయాల్లో ఉంటే నిజాయితీగా ఉండలేమన్నారు. దాన్ని డీల్‌ చేసే టైమ్‌ తన వద్ద లేదని తెలిపింది. దాని గురించి ఆలోచించకుండా తన వర్క్ తాను చూసుకుంటానను..' అని ఓ ట్వీట్ చేసిన అనసూయ, అనంతరం మరో ట్వీట్ లో  ''క్షమించండి.. ఒక్క విషయం గురించి తెగ నవ్వొస్తుంది. మీతో పంచుకుంటున్నా ఏమనుకోవద్దే. నిన్న `అత్యధిక మెజారిటీ`, `భారీ మెజారిటీ` తో గెలుపు అని, ఈ రోజు ఓటమి అంటున్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగి ఉంటుందబ్బా. అసలు ఉన్న సుమారు 900 ఓటర్స్ లో సుమారు 600 చిల్లర ఓటర్స్ లెక్కింపు రెండో రోజుకి వాయిదా వేయాల్సనంత టైమ్‌ ఎందుకు పట్టిందంటారు? ఆ.. ఏదో అర్థం కాక అడుగుతున్నా'' అని కామెంట్ చేశారు. 

Also read యాంకర్ విష్ణు ప్రియా హాట్‌ నెస్‌ ఓవర్‌లోడ్‌.. పర్పుల్‌ కలర్‌ గౌన్‌లో పరువాల విందు
ఎన్నికల్లో గోల్ మాల్ జరిగిందని సెటైరికల్ గా అనసూయ ట్వీట్స్ చేయడంతో మీడియా ఈ విషయంపై స్పష్టత కోరారు. లేనిపోని వివాదాల కారణంగా కెరీర్ డామేజ్ అయ్యే అవకాశం ఉందని భావించిన అనసూయ ఆచితూచి మాట్లాడారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన ఈటీవి ప్రభాకర్, సమీర్, ఉత్తేజ్.. Manchu vishnu, మోహన్ బాబు, నరేష్ లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంటికి తీసుకెళ్లారని, దీన్ని ప్రశ్నించినందుకు విష్ణు తనపై అరిచారన్నారు. శివబాలాజీ తనతో గొడవపెట్టుకున్నట్లు సమీర్ వెల్లడించారు. ప్రకాష్ రాజ్ తో పాటు మెజారిటీ ప్యానెల్ మెంబర్స్ ఎన్నికల నిర్వహణ సరిగా లేదన్న అభిప్రాయం వెల్లడించారు. 

click me!