తెలుగులో రిలీజ్ అవుతున్న స్టైయిట్ సినిమాల పరిస్దితే కలెక్షన్స్ పరంగా పెద్దగా ఉండటం లేదు. ఇలాంటప్పుడు రజనీ సినిమాని పట్టించుకునేవాళ్లు ఎవరు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. తెలుగు లో అన్నాత్తేను అదే టైటిల్ తో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న న్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిట్,ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా ఆయన సినిమాలకు డిమాండ్ ఉంటుంది. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ చిత్రం మోషన్ పోస్టర్స్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు వెర్షన్ పరిస్దితి ఏమిటనేది ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది.
నవంబర్ 4న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే రజనీ గత చిత్రాలకు తెలుగులో వచ్చిన క్రేజ్ ని ఈ సినిమాని తేలేకపోయింది. అందుకు కారణం కోవిడ్,ప్రభుత్వ నిర్ణయాలతో అతలాకుతలమైన ఎగ్జిబిటిర్స్ వ్యవస్ద అని చెప్పాలి. తెలుగులో రిలీజ్ అవుతున్న స్టైయిట్ సినిమాల పరిస్దితే కలెక్షన్స్ పరంగా పెద్దగా ఉండటం లేదు. ఇలాంటప్పుడు రజనీ సినిమాని పట్టించుకునేవాళ్లు ఎవరు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. తెలుగు లో అన్నాత్తేను అదే టైటిల్ తో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
Also read స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేసిన మహేష్ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్?
ఏసియన్ సినిమాస్ వారు ఈ సినిమా థియోటర్ రైట్స్ ని 12 కోట్లు ఇచ్చి తీసుకున్నారని వార్త. అయితే ఆ స్దాయిలో ఓపినింగ్స్ వస్తేనే రికవరీ ఉంటుంది. లేకపోతే కష్టమే అంటున్నారు. కానీ ఏసియన్ సినిమాస్ వారికి నైజాంలో థియోటర్స్ ఉండటం ప్లస్ కానుందంటున్నారు. ఇప్పుడు ఏసియన్ సినిమాస్ తీసుకోవటం అనేది నిజమే అయితే దీపావళికి వస్తున్న మిగతా సినిమా నిర్మాతల గుండెల్లో రాయిపడినట్లే. ఎందుకంటే ఖచ్చితంగా థియోటర్స్ మంచివి,బాగున్నవి తమ సినిమాకే కేటాయించుకుంటారు అంటున్నారు. బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాతో పాటు తెలుగు నుండి మరి కొన్ని చిన్న సినిమాలు కూడా అదే వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వాటితో అన్నాత్తే సినిమా పోటీ పడాల్సి ఉంటుంది.
Also read బాలయ్య నెక్స్ట్ కి ఆ టైటిల్? నిజమే అయితే మామూలుగా ఉండదు
మరో ప్రక్క తాజాగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీం. రజనీకాంత్ తన అభిమానులకి పండగ సందడిలాంటి ఓ కొత్త కబురుని వినిపించారు. ‘అన్నాత్తే’ సినిమా టీజర్ ఈ నెల 14న విడుదల కానుందన్నదే ఆ కబురు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న చిత్రమిది. రజనీకాంత్‌కి జోడీగా నయనతార నటిస్తున్నారు. కీర్తిసురేశ్, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.