ATMAA: ప్రకాష్ రాజ్ కొత్త కుంపటి ఆత్మా నిజమే? ప్రకటించక పోవడానికి కారణం ఇదే!

By team teluguFirst Published Oct 13, 2021, 9:02 AM IST
Highlights

ప్రకాష్ రాజ్ మా కు పోటీగా ఆత్మా ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి, అందులో ఏమాత్రం నిజం లేదు అన్నారు. ప్రకాష్ రాజ్ ఆత్మా ను కొట్టిపారేసినా.. ఈ ఆలోచన జరిగినట్లు పరిశ్రమ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.

 

మా ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా ముందుకు వచ్చిన ప్రకాష్ రాజ్ తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాంతీయవాదంతో ఓడించిన మా లో సభ్యునిగా కొనసాగలేను, నన్ను పరాయివాడిగా భావిస్తున్నారు, అలాగే ఉంటా అంటూ ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో 'ఇంతటితో అయిపోలేదు అసలు కథ ఇప్పుడే మొదలైంది' అంటూ... ప్రెస్ మీట్ ముగించారు.  

కాగా నిన్న సాయంత్రం ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో మీడియా ముందుకు వస్తున్నారన్న వార్త టాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. తన ప్యానెల్ నుండి గెలిచిన సభ్యులు అందరితో కమిటీకి రాజీనామా చేయించనున్నారని, అలాగే మా కు పోటీగా ఆత్మా(ATMAA) పేరుతో మరో అసోసియేషన్ స్థాపించనున్నారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ప్రకాష్ రాజ్ తరపున గెలిచిన శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీలతో పాటు 8మంది ఈసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు వర్గాల ప్యానెల్ సభ్యులు కమిటీలో ఉండడం వలన అభివృద్ధి జరగదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. 

చివర్లో ప్రకాష్ రాజ్ మా కు పోటీగా ఆత్మా ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి, అందులో ఏమాత్రం నిజం లేదు అన్నారు. మా ప్యానెల్ నుండి ఎన్నికైన సభ్యులు రాజీనామా చేసినప్పటికీ, విష్ణు ప్యానెల్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కృషి చేస్తాం.. వాళ్ళను ప్రశ్నిస్తాం అన్నారు. అయితే Prakash raj ఆత్మా ను కొట్టిపారేసినా.. ఈ ఆలోచన జరిగినట్లు పరిశ్రమ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. 


ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని నమ్మడంతో పాటు, Manchu vishnu ప్యానెల్ లో శ్రీకృష్ణ పాత్ర పోషిస్తున్న నరేష్ పట్ల తీవ్ర అసహనంతో ఉన్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు, ఆయనకు మద్దతుగా ఉన్న ఇండస్ట్రీ పెద్దలు ఈ ఆలోచన చేశారట. మా అసోసియేషన్ కి ధీటుగా ఆత్మా స్థాపించి, మా తలదన్నేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరపాలని నిర్ణయించారట. 

Also read నరేష్‌ని చాణక్యుడితో పోల్చిన సమీర్‌.. ఆయన ఉంటే పనులు జరగవు.. మాకు సెట్‌ కాదంటోన్న శ్రీకాంత్‌..

అయితే ఓడిపోయిన వెంటనే ఇలా కొత్త కుంపటి పెట్టడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. ఇగోల కారణంగా పరిశ్రమను రెండుగా చీలుస్తున్నారనే ఆరోపణలు ఎదురయ్యే అవకాశం కలదు. అందుకే ప్రకాష్ రాజ్ మొదట తన ప్యానెల్ నుండి గెలిచిన సభ్యుల చేత రాజీనామా చేయించి, దాని వెనుక కారణాలు వెల్లడించాలని భావించినట్లు తెలుస్తుంది. ఓ ఆరు నెలల తరువాత మంచు విష్ణు పనితీరు బాగోలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే కారణాలు చూపుతూ... ఆత్మకు శ్రీకారం చుట్టనున్నారట.

 ప్రకాష్ రాజ్ తో పాటు ఆయన మద్దతుదారులు కలిసి దీని కోసం పక్కా ప్రణాళిక తయారు చేసినట్లు సమాచారం. మరి అదే జరిగితే పరిశ్రమలో చీలికలు వచ్చినట్లే. అవకాశాలు, నటులు, చిత్రాలు ఇలా అనేక విధాలైన భేదభావాలు వెలువడుతాయి. 

Also read ఎన్నికలయ్యాకా.. ఒక్కొక్క ‘‘లం..***’’ కొడుకు సంగతి చూస్తానన్నారు : నరేశ్‌పై ఉత్తేజ్ ఘాటు వ్యాఖ్యలు

click me!