`కేసరి` అంటూ అడ్డంగా బుక్కైన స్టార్‌ హీరోలు.. షారుఖ్, అజయ్, టైగర్‌కు లీగల్‌ నోటీసులు

Published : Mar 10, 2025, 10:20 AM IST
`కేసరి` అంటూ అడ్డంగా బుక్కైన స్టార్‌ హీరోలు..  షారుఖ్, అజయ్, టైగర్‌కు లీగల్‌ నోటీసులు

సారాంశం

గుట్కా తినేలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు కోర్టు సమన్లు జారీ చేసింది.

చాలావరకు విషపూరిత పదార్థాల ప్రకటనల్లో పెద్ద పెద్ద సినిమా స్టార్లు, క్రికెటర్లు, ఇంకా కొన్ని రంగాల సెలబ్రిటీలు కనిపించడం కామన్ అయిపోయింది. తాము చూపే ప్రకటనల్లోని పదార్థాలను జీవితంలో ఒక్కసారైనా వాడకపోయినా కోట్లు కోట్లు డబ్బుకు ఆశపడి అందులో బ్రాండ్‌ అంబాసిడర్లుగా చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందులోనూ ప్రాణానికి హాని కలిగించే, శరీర భాగాలకు శాశ్వత నష్టం కలిగించే ప్రకటనలకు అడ్డుకట్ట పడటం లేదు.

హీరోలను ఫాలో అయ్యే ఆడియెన్స్ కోట్ల మంది..

కొన్ని నెలల క్రితం కోర్టు,  ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేస్తే, మళ్లీ ప్రకటనలు మొదలవుతాయి. ఇంకోవైపు సినిమా స్టార్లనే దేవుళ్ళు అని నమ్మేవాళ్ళు ఎంతోమంది జనాలు ఉన్నారు. వాళ్ళ హెయిర్ స్టైల్, లైఫ్ స్టైల్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఇలా సినిమా నటులు, నటీమణులను ఫాలో అవ్వడం అంటే ఈ రోజుల్లో చాలామందికి పిచ్చ ఇష్టం. అదే కారణంతో వాళ్ళు ప్రకటనల్లో కనిపిస్తే అదే పంచామృతం అనుకుని సేవించేవాళ్ళు తక్కువేమీ కాదు.

`కేసరి` యాడ్‌లో అజయ్‌ దేవగన్‌,షారూఖ్‌, టైగర్‌ ష్రాఫ్‌..

అలాంటిదే ఒక ప్రకటన `కేసరి`. కణ కణంలోనూ కేసరి ఉందని షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), అజయ్ దేవగన్ (Ajay Devgn), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) ఈ ప్రకటనలో కనిపిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ కంటే ముందు అక్షయ్ కుమార్ ఇందులో ఉండేవాడు. కానీ చివరికి తను చేస్తున్నది తప్పు అని తెలుసుకుని, ప్రజల దారిని నేను తప్పించలేను అంటూ క్షమాపణ కోరి ప్రకటన నుంచి తప్పుకున్నాడు.

అతను పోతేనేం డబ్బు కోసం ఇంకొకరు దొరకరాని వాళ్ళా? అలా దొరికిన వాడే టైగర్ ష్రాఫ్. ఇప్పుడు ఈ ముగ్గురికీ లీగల్ కష్టాలు వచ్చాయి. ఈ నటులపై కేసు నమోదైంది. ఈ ఘటనకు జైపూర్ జిల్లా వినియోగదారుల కమిషన్ సమన్లు జారీ చేసింది.

read  more: చిరు-అనీల్ మూవీ: పాత హిట్ కథనే తిప్పి చెప్పబోతున్నారా?

షారూఖ్‌, అజయ్‌, టైగర్‌ ష్రాఫ్‌లకు లీగల్‌ నోటీసులు..

 నటులతో పాటు గుట్కా తయారీ కంపెనీ జేబీ ఇండస్ట్రీస్‌కు కూడా సమన్లు జారీ చేశారు. అందరూ మార్చి 19న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. గుట్కాలో కేసరి ఉందని ఈ నటులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ అందులో కేసరి ఉందని అబద్ధం చెబుతున్నారు అని జైపూర్ నివాసి యోగేంద్ర సింగ్ బడియాల్ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ యాడ్‌ వినియోగదారుల రక్షణ చట్టం 2019ను ఉల్లంఘిస్తుంది, ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది అని ఆయన తన అప్లికేషన్‌లో పేర్కొన్నారు.

నిజమైన కేసరి కేజీకి లక్ష కంటే ఎక్కువ డబ్బు ఉంటుంది. కానీ ఐదు రూపాయల ప్యాకెట్‌లో కేసరి ఉందని ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. ఈ ముగ్గురు నటులు చాలా కాలంగా పాన్ మసాలా, గుట్కా కంపెనీ ప్రకటనలో కనిపిస్తున్నారు. టేస్ట్ ఆఫ్ బిగ్ బ్రాండ్స్ అనే ట్యాగ్‌లైన్ కింద ఈ ప్రకటనలు దీన్ని కేసర్ ఉత్పత్తి అని ప్రచారం చేస్తున్నాయి. కానీ నిజానికి ఇది గుట్కా ఉత్పత్తుల ప్రచారం అని యోగేంద్ర సింగ్ తెలిపారు.

ఒకవేళ ఆరోపణ నిజమైతే ఈ ప్రకటనలను బ్యాన్ చేసి దీని ప్రచార సెలబ్రిటీలపై ఆర్థికంగా జరిమానా విధించవచ్చు. అదే సమయంలో వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం ప్రకటనలు చేస్తున్న నటులకు, కంపెనీకి జరిమానా విధించే అవకాశం చట్టంలో ఉంది.  ఇదిలా ఉంటే `కేసరి` యాడ్‌ కవర్‌పై ఇలాజీ అని ఉండటం గమనార్హం. 

read  more: రామ్‌ చరణ్‌ చేత గిన్నెలు తోమిపిచ్చిన సుకుమార్‌.. విషయం తెలియడంతో చిరంజీవి రియాక్షన్‌ ఏంటో తెలుసా?

also read: ఎంగేజ్‌మెంట్‌తో నటి అభినయ రూమర్లకి చెక్‌.. ఆమె కాబోయే భర్త ఎవరు? పోస్ట్ వైరల్‌

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?