
భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకుని మరోసారి చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నిఅంటుతున్న వేళ.. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు టీమ్ ఇండియాపై అభినందనల వర్షం కురుపిస్తున్నారు. ఇక టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు వరుసగా ట్వీట్లు వేస్తున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే?
టీమ్ ఇండియా విజయంపై మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు, టీమ్ గిండియా గెలుపుతో తాను గర్వంతో ఉప్పొంగిపోయారని ట్వీట్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ గెలిచిన తర్వాత ఆయన ఈ ట్వీట్ చేశారు
ఇండియా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. మనవాళ్ళను చూస్తుంటే గర్వంగా ఉంది అన్నారు. ఇండియా గెలుపును ఎంజాయ్ చేస్తున్నానంటూ జైహింద్ అని ముగించారు చిరంజీవి.
అద్భుతమైన మ్యాచ్ ను ఎంత ఎంజాయ్ చేశానన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. టీమ్ ఇండియాకు ప్రత్యేకంగా శఉభాకాంక్షలు, అభినందనలు తెలిపారు చరణ్. విజయాన్ని ఇంటికి మొసుకొస్తున్నారంటూ ట్వాట్ చేశారు రామ్ చరణ్.
ఇక టీమ్ ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్. టీమ్ ఇండియా విన్నింగ్ ట్రోఫీని గెలవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా, విజయం సాధించిన టీం ఇండియాకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చిందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ‘ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ గెలుచుకున్న టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. మీ అంకితభావం, కృషి మరియు ప్రతిభ అద్భుతం’అని పోస్ట్ చేశారు. ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత జట్టు దేన్నీ తగ్గనీయకుండా అదరగొట్టిందని పవన్ పేర్కొన్నారు, భారత జట్టు సత్తా ఏస్థాయిలో ఉందో మరోసారి నిరూపించిందన్నారు.