ఎంగేజ్‌మెంట్‌తో నటి అభినయ రూమర్లకి చెక్‌.. ఆమె కాబోయే భర్త ఎవరు? పోస్ట్ వైరల్‌

Published : Mar 10, 2025, 08:02 AM ISTUpdated : Mar 10, 2025, 08:26 AM IST
ఎంగేజ్‌మెంట్‌తో నటి అభినయ రూమర్లకి చెక్‌.. ఆమె కాబోయే భర్త ఎవరు? పోస్ట్ వైరల్‌

సారాంశం

Abhinaya Engagement: నటి అభినయం రూమర్లకి చెక్‌ పెట్టింది. సైలైంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అభిమానులను సర్ప్రైజ్‌ చేసింది. కానీ ఆ విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టింది. 

Abhinaya Engagement: నటి అభినయ రూమర్లకి చెక్‌ పెట్టింది. విశాల్‌తో ప్రేమలో ఉన్నట్టు, ఆయన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు గత కొంత కాలంగా రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ రూమర్లకి చెక్‌ పెట్టింది అభినయం.

ఒక్క ఫోటోతో అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది. అదే సమయంలో అందరికి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఎంగేజ్‌మెంట్‌ ఫోటోని పంచుకుంది. 

నటి అభినయ ఎంగేజ్‌మెంట్‌ ఫోటో పంచుకుంది..

సోషల్‌ మీడియా ద్వారా ఎంగేజ్‌మెంట్‌ పిక్‌ని పంచుకుంది  అభినయ. ఇందులో రింగ్‌లు మార్చుకున్న పిక్‌ని షేర్‌ చేయడం విశేషం. ఈ ఫోటోలో తన చేయి, అబ్బాయి చేయి ఉంది. వేళ్లకి రింగులున్నాయి.

`మా ప్రయాణం నేటితో ప్రారంభం` అని వెల్లడించింది అభినయ. కేవలం ఇద్దరి చేతులు, రింగులు చూపించి ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందనే విషయాన్ని కన్ఫమ్‌ చేసింది. అయితే కాబోయే భర్త ఎవరు అనేది ఆమె వెల్లడించలేదు. 

అభినయ కాబోయే భర్త ఎవరు? అదే మిస్టరీ

అభినయం చేసుకునే వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. విశాల్‌తో రూమర్లు ఉన్న నేపథ్యంలో అది నిజంగా కాదనే విషయాన్ని మాత్రం ఈ ఒక్క ఫోటో చెబుతుంది. అందులో ఉన్న వ్యక్తి వేరే అని తెలుస్తుంది. అతను ఎవరు అనేది మిస్టరీ. ఆ విషయాన్ని రహస్యంగా పెట్టింది అభినయ. మున్ముందు అతన్ని పరిచయం చేసే అవకాశం ఉంది.

read more: రాజశేఖర్‌ నో చెప్పిన సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన చిరంజీవి, ఆ మూవీ ఏంటో తెలుసా? రెండు సార్లు సేమ్‌

స్నేహితుడితో రిలేషన్‌.. అతడితోనే అభినయ పెళ్లా?

అయితే తన రిలేషన్‌పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అభినయ స్పందించింది. తాను తన చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలిపింది. తమది 15ఏళ్ల బంధం అని పేర్కొంది. ఏ విషయం అయినా ఆయనతోనే పంచుకుంటానని తెలిపింది.

కాబట్టి తన ప్రియుడినే ఆమె పెళ్లిచేసుకోబోతుందనే విషయం స్పష్టమవుతుంది. కానీ అతను ఎవరు అనేది మాత్రం మిస్టరీ. మరి అతను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినా? బిజినెస్‌ మ్యానా? అనేది తెలియాల్సి ఉంది. అది కనిపెట్టే పనిలో నెటిజన్లు బిజీగా ఉన్నారు. 

అభినయ చెవుడు, మూగ. అయినా నటిగా రాణించడం గ్రేట్ అనే చెప్పాలి. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది. విశాల్‌తో ఇటీవల `మార్క్ ఆంటోనీ` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇక తెలుగులో `కింగ్‌`, `శంభో శివ శంభో`, `దమ్ము`, `ఢమరుకం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `ధృవ`, `సీతా రామమ్`, `రాజు గారి గది 2`, `గామి`, `ఫ్యామిలీ స్టార్‌` చిత్రాల్లో కూడి నటించింది అభినయం.  

read  more: టీమ్ ఇండియా గెలిస్తే పూనమ్ పాండేలా ఆఫర్ ఇచ్చిన నటి తాన్యా.. ఏం ఇవ్వబోతుందో తెలిస్తే పండగే

also read:  శ్రీలీల పిలిచే `ఓజీ` ఎవరో తెలుసా? ఉమెన్స్ డే రోజు సర్‌ప్రైజ్‌, అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. పోస్ట్ వైరల్‌

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?