మహేష్ ‘భరత్ అను నేను’ స్టిల్ లీక్

Published : Oct 06, 2017, 02:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
మహేష్ ‘భరత్ అను నేను’ స్టిల్ లీక్

సారాంశం

మహేష్, కొరటాల కాంబినేషనల్ తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’ లీకైన ‘భరత్ అను నేను’ సినిమా స్టిల్ అసంతృప్తి వ్యక్తం చేసిన దర్శకుడు కొరటాల 

మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భరత్ అను నేను’. కైరా అడ్వాణి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అందులో మహేష్.. నడుచుకుంటూ వస్తుండగా.. ఆయన చుట్టూ బాడీ గాడ్స్ ఉన్నారు. మహేష్ వెనుక నటుడు బ్రహ్మాజీ కూడా ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్న విషయం తెలిసిందే.

 

అయితే.. స్టీల్ లీక్ అవ్వడంపై దర్శకుడు కొరటాల శివ అసంతృప్తి వ్యక్తం చేశారు. దయచేసి తమ చిత్రం నుంచి లీకైన స్టిల్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేయొద్దని కోరారు. చిత్రాన్ని ఉత్తమంగా ప్రేక్షకులకు అందించాలని భావించి కష్టపడుతున్న యూనిట్‌ సభ్యులకు దీని వల్ల బాధే మిగులుతుందని ట్వీట్‌ చేశారు. ‘శ్రీమంతుడు’ తర్వాత కొరటాల, మహేశ్‌ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది.

 

ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, ఆర్‌. శరత్‌కుమార్‌, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రవి కె. చంద్రన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే