`మా` ఎన్నికలు రేపు(అక్టోబర్ 10)న జరగబోతున్నాయి. శుక్రవారం సాయంత్రంతోనే ప్రచారానికి తెరపడింది. ఇక `మా` ఓటర్లని ప్రసన్నం చేసుకునే పనిలో పోటీలో అభ్యర్థులు బిజీ అయ్యారు. అయితే శుక్రవారం సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు `మా` ఎన్నికలపై స్పందించిన విషయం తెలిసిందే.
`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల వేడి రోజు రోజుకి మరింతగా పెరుగుతుంది. హుజూరాబాద్ బై ఎలక్షన్ల కంటే `మా` ఎన్నికలే ఇప్పుడు స్టేట్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. టీవీల్లో, సోషల్ మీడియాల్లో ఇదే మెయింట్ పాయింట్‌గా నిలుస్తుంది. వీటిపైనే హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంతేకాదు `మా` అధ్యక్ష పీఠం కోసం పోటీ చేస్తున్న మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం, వారి ప్యానెల్ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేయడం, పెద్దలు సైతం హాట్ కామెంట్లు చేయడం ఇప్పుడు `మా`ని హాట్ టాపిక్‌గా మార్చాయి.
maa election రేపు(అక్టోబర్ 10)న జరగబోతున్నాయి. శుక్రవారం సాయంత్రంతోనే ప్రచారానికి తెరపడింది. ఇక `మా` ఓటర్లని ప్రసన్నం చేసుకునే పనిలో పోటీలో అభ్యర్థులు బిజీ అయ్యారు. అయితే శుక్రవారం సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు `మా` ఎన్నికలపై స్పందించిన విషయం తెలిసిందే. మంచు విష్ణు ప్యానెల్ ఆయన్ని కలుసుకుని శాలువాతో సత్కరించారు. ఈసందర్భంగా manchu vishnuకి మద్దతు పలికారు కోటా. అదే సమయంలో prakash rajపై విమర్శలు గుప్పించారు.
undefined
ప్రకాష్‌రాజ్‌ని నటుడిగా ఏం మాట్లాడానని, కానీ షూటింగ్‌లకు మాత్రం ఆలస్యంగా వచ్చే వారని తెలిపారు. ఏ `మా` కార్యవర్గ సమావేశానికి ప్రకాష్‌రాజ్ రాలేదన్నారు. ప్రకాష్‌రాజ్ `మా`లో రెండు సార్లు సస్పెన్షన్‌కి గురయ్యారని kota srinivas rao గుర్తు చేశారు. అంతే కాదు ఈ సందర్బంగా మెగా ఫ్యామిలీపై ఆయన హాట్ కామెంట్ చేశారు. చిరంజీవి లేకపోతే mega familyలో ఏమీ లేదన్నారు. మెగా ఫ్యామిలీలో ఆయన ఒక్కడి ప్రభావమే అని, మిగిలిన వారు ప్రభావితం చేయలేరని పరోక్షంగా తెలిపారు కోటా.
related news: మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు.. నువ్వెక్కడ పుట్టావ్, ప్రకాశ్‌రాజ్ స్థాయి ఇది: నాగబాబు వ్యాఖ్యలు
`మా` ఎన్నికల్లో మీ కుటుంబం నుంచి ఎవరినైనా నిలబెట్టండి అని chiranjeeviకి తాను ముందే చెప్పానని వెల్లడించారు కోటా. కానీ ప్రకాష్‌రాజ్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం తనకు నచ్చలేదన్నారు. శుక్రవారం ఓ టీవీ ఛానెల్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు కోటాశ్రీనివాసరావు. ఇదిలా ఉంటే ఆదివారం జరగబోతున్న `మా` ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఈ పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సాధ్యమైతే అదే రోజు నైట్ వరకు ఫలితాలను వెల్లడించాలని, లేదంటే సోమవారం(అక్టోబర్ 11)న రిజల్ట్ ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
also read: ఇక్కడే ఉంటాడు..ఈ ఊళ్లలోనే ఉంటాడంటూ.. మంచు విష్ణు గెలుపుకోసం మోహన్‌బాబు ఓపెన్ లెటర్..