విడాకుల తర్వాత ఫస్ట్ టైమ్‌ బయటకొచ్చిన చైతూ.. అఖిల్‌ ఇంకా `సిసింద్రి`లో పాకుతున్నట్టే ఉందట..

By Aithagoni RajuFirst Published Oct 9, 2021, 12:45 AM IST
Highlights

సమంతతో విడిపోయిన బాధ తాలుకూ ఫీలింగ్‌ దాచుకుని బయటకు నవ్వుతూ కనిపించాడు చైతూ. అఖిల్‌కి బూస్టప్‌ ఇచ్చాడు. `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` సినిమాకి అభినందనలు తెలిపారు. ఈ సినిమా ఒక సెలబ్రేషన్‌లా ఉండబోతుందన్నారు. 

నాగచైతన్య..సమంతతో విడాకుల తర్వాత ఫస్ట్ టైమ్‌ బయటకు వచ్చాడు. తన బ్రదర్‌ అఖిల్‌ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్ లర్‌` సినిమా కోసం గెస్ట్ గా వచ్చాడు. ఇందులో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సమంతతో విడిపోయిన బాధ తాలుకూ ఫీలింగ్‌ దాచుకుని బయటకు నవ్వుతూ కనిపించాడు చైతూ. అఖిల్‌కి బూస్టప్‌ ఇచ్చాడు. సినిమాకి అభినందనలు తెలిపారు. ఈ సినిమా ఒక సెలబ్రేషన్‌లా ఉండబోతుందన్నారు. 

`రోజులు మారతాయి.. పరిస్థితులు మారతాయి.. మీ ఎనర్జీ మారదు` అంటూ అక్కినేని అభిమానులపై ప్రశంసలు కురిపించాడు naga chaitanya. ఇంకా మాట్లాడుతూ, `బన్నీ వాసు కథని నమ్ముతాడు. allu arvind ఓ సినిమా చేయాలంటే పెద్ద ప్రాసెస్‌ అంటారు. ఆ ప్రాసెస్‌, డెడికేషన్‌ అలానే ఉండాలి. ఆయనకు ఓటీటీ ఉన్నా, ఈ సినిమాని హోల్డ్ చేసి థియేటర్‌ కోసం వేచి ఉన్నారంటే అభినందించాల్సిందే. ఈ సినిమాపై హ్యాపీగా ఉంది. దర్శకుడు భాస్కర్ ప్రతి రోజువారి జీవితంలోనుంచి కొత్త యాంగిల్‌ తీస్తారు. హ్యూమన్‌ ఎమోషన్‌ని పట్టుకుంటాడు.

akhil ఒక సినిమా రిజల్ట్ కన్నా, ఆ సినిమా కోసం ఎక్కువ శ్రమిస్తాడు. అదే నాకు బాగా ఇష్టం. నెక్ట్స్ సినిమానే కాదు, నెక్ట్స్ నాలుగైదేళ్లు ఎలాంటి సినిమా చేయాలని, ఎలాంటి కథలు చేయాలనేది మైండ్‌లో ఉన్నాయి. ఓ మాస్టర్‌ ప్లాన్‌ ఉంది. ఎలాగైనా అది చేసే తీరుతాడు.  అఖిల్‌ ఇంకా సిసింద్రిలా పాకుకుంటూ వస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ పోస్టర్స్ చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. ప్రతి ఏడాది ఇంట్లో ఓ కొత్త అఖిల్‌ని చూస్తాను. pooja hegdeతో `ఒక లైలా కోసం` చేశాం. ఆ సినిమా ఇప్పటికీ నా మైండ్‌లో తిరుగుతుంది. ఈ సినిమా ఓ సెలబ్రేషన్‌లా ఉండబోతుంది` అని తెలిపారు.

అఖిల్‌ మాట్లాడుతూ, `పూజా హెగ్డే బ్యూటీఫుల్‌, హార్డ్ వర్క్. కొన్నిసార్లు ఆమె నుంచి నేను ఇన్‌స్పైర్‌ అవుతాను. ఆమెతో పనిచేయడం ప్లెజర్‌ ఫీలింగ్. అల్లు అరవింద్‌కి, మా ఫ్యామిలీకి మధ్య ఒక ప్రామిస్‌ ఉంది. దాన్ని నిజం చేసి మాట్లాడతా. కరోనా అందరిని ఎఫెక్ట్ చేసింది. కానీ వాటిని దాటుకుని రావాల్సి వచ్చింది. కరోనా వచ్చినప్పుడు థియేటర్లు ఆగిపోయి ఇంట్లో కూర్చున్నప్పుడు ఏంటీ ఈ కర్మ, మనకు ఎందుకిలా జరుగుతుందనేది బాధగా ఉండేది. దాన్నుంచి బయటపడి మళ్లీ థియేటర్లు ఓపెన్‌ కావడం, షూటింగ్‌లు జరగడంతో ఓ హోప్‌ వచ్చింది. 

also read:నేను అబార్షన్‌ చేసుకోలేదు.. ఎవరితోనూ అఫైర్స్ లేవు.. రూమర్స్ పై సమంత సంచలన పోస్ట్

కానీ అంతలోనే సెకండ్‌ వేవ్‌ వచ్చింది. ఆ తర్వాత థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్‌ అనే దారుణమైన కామెంట్లు వినాల్సి వచ్చింది. ఎవరికైనా హోప్‌ అవసరం. అలాంటి హోప్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత `లవ్‌స్టోరి` ఇచ్చింది. థియేటర్లో సినిమాలు ఆడతాయనే హోప్‌ ఇచ్చింది. ఆ హోప్‌తోనే మేం వస్తున్నాయి. మంచి రోజులు రాబోతున్నాయి. కచ్చితంగా గత వైభవాన్ని చూస్తాం. `లవ్‌స్టోరి`తో ధైర్యం చేసిన నా బ్రదర్‌కి, వాళ్ల టీమ్‌కి అభినందనలు. ఇప్పుడు ముందడుగు వేసే సమయం వచ్చింది. ఫైట్‌ చేయాల్సిందే. 15 అక్టోబర్‌ థియేటర్లోనే కలుద్దాం. అక్కినేని అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకునేంత వరకు నిద్ర పోను` అని అఖిల్‌ అన్నారు. ఈ సందర్భంగా బన్నీ వాసు, వాసు వర్మ,  భాస్కర్‌కి థ్యాంక్స్ చెప్పాడు అఖిల్‌. 

click me!